వైసీపీ ఆఫీస్ ను కూల్చడం ఫై అంబటి ఆగ్రహం

తాడేపల్లిలో నిర్మాణంలో అక్రమంగా కడుతున్న వైసీపీ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసింది. శనివారం ఉదయం 5:30 గంటల సమయంలో కూల్చివేత ప్రారంభించారు. పొక్లైన్లు, బుల్డోజర్లతో భవనం కూల్చివేశారు. శ్లాబ్‌కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేశారు అధికారులు. కూల్చివేతకు సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌ చేస్తూ నిన్న హైకోర్టును కోర్టును ఆశ్రయించింది వైసీపీ.

వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లిలోని 2 ఎకరాల విస్తీర్ణంలో పార్టీ కార్యాలయ నిర్మాణం మొదలైంది. కానీ ఇక్కడ అక్రమంగా పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని గతంలో సీఆర్‌డీఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఈ విషయంలో వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇక నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో.. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం మారడంతో అధికారులు దాన్ని కూల్చివేశారు.

ఈ కూల్చివేత ఫై మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసారు. “సూప‌ర్‌ 6 అమలు కన్నా వైసీపీ ఆఫీసు కూల్చ‌డ‌మే ముఖ్య‌మ‌ని భావించిన చంద్ర‌న్న ప్రజాస్వామ్యవాదా..? విధ్వంసకారుడా..?” అంటూ ట్వీట్ చేశారు. ఇది ప్రజాస్వామ్యం కాదని, విధ్వంసమేనని ఆయ‌న‌ విమర్శించారు. దీనికి తాడేపల్లిలో నిర్మాణాన్ని బుల్డోజ‌ర్లు కూల్చివేస్తున్న వీడియోను జ‌త చేశారు.

Super 6 అమలు కన్నా
Ycp ఆఫీసు కూల్చడమే
ముఖ్యమని భావించిన చంద్రన్న
ప్రజాస్వామ్యవాదా?విధ్వంసకారుడా? pic.twitter.com/k7rDQIU7KN— Ambati Rambabu (@AmbatiRambabu) June 22, 2024