2025 నుండి Amazon Prime Video కొత్త నిబంధనలు
Amazon Prime Video భారతీయ సుబ్స్చ్రిబెర్స్ కోసం 2025 జనవరి నుంచి కీలక మార్పులను అమలు చేయనుంది. మీ ఖాతాను పాస్‌వర్డ్ ద్వారా కుటుంబ సభ్యులు లేదా మిత్రులతో షేర్ చేసుకోవడం, లేదా పలు డివైజ్‌లలో స్ట్రీమింగ్ చేయడం అలవాటు అయి ఉంటే, ఈ మార్పులు మీకు భాధ కలిగించవచ్చు.
Amazon Prime వీడియో లో మార్పులు:
- డివైజ్ లిమిట్ తగ్గింపు: ప్రస్తుతం, Amazon Prime Video ఖాతాను 10 డివైజ్‌లలో లాగిన్ చేయవచ్చు. అయితే, 2025 జనవరి నుంచి ఇది 5 డివైజ్‌లకు పరిమితం చేయబడుతుంది.
- టీవీలపై ప్రత్యేక పరిమితి: ఈ 5 డివైజ్‌లలో, కేవలం 2 టీవీలు మాత్రమే లాగిన్ చేయడానికి అనుమతించబడతాయి. 2 టీవీలు ఇప్పటికే లాగిన్ అయి ఉంటే, మూడవ టీవీని జోడించాలంటే అందులో ఒకటి సైన్ అవుట్ చేయాల్సి ఉంటుంది.
- డివైజ్ మేనేజ్‌మెంట్: కొత్త నిబంధనలతో, మీరు ప్రతి 30 రోజులకు 2 డివైజ్‌లను తొలగించి, కొత్తవాటిని జోడించవచ్చు. ఇది పాత డివైజ్‌లను సులభంగా కొత్తవాటితో మార్చడానికి అనుకూలంగా ఉంటుంది.
ఈ మార్పు ఎందుకు అనేదే అందరి మదిలో ఉన్న ముఖ్యమైన ప్రశ్న. వ్యక్తిగత వినియోగానికి తగినంత స్వేచ్ఛను కల్పిస్తూనే ఖాతా షేరింగ్‌ను తగ్గించేందుకు అమెజాన్ తన నిబంధనలను కఠినతరం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది స్ట్రీమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడంలో దోహదపడుతుందని సంస్థ భావిస్తోంది.
అపరిమిత యాడ్-ఫ్రీ స్ట్రీమింగ్ మరియు పాపులర్ షోలు మరియు సినిమాలకు యాక్సెస్ మార్పులు లేకుండా అలాగే కొనసాగుతాయి. అయితే, జనవరి 2025 నుండి, మీరు ఐదు పరికరాల పరిమితి మరియు రెండు టీవీల క్యాప్‌తో మీ Amazon Prime పరికరాలను జాగ్రత్తగా నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలి.
భారతదేశంలో ప్రైమ్ మెంబర్షిప్ ప్లాన్‌లు నెలవారీ ప్లాన్ రూ. 299, త్రైమాసిక ప్లాన్ రూ. 599, వార్షిక ప్లాన్ రూ. 1499, Prime Lite (వార్షిక) రూ. 799, Prime Shopping Edition (వార్షిక) రూ. 399. ఈ ప్లాన్‌లను మీ అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవచ్చు.