అమరావతి లో రూ.250 కోట్లతో కొత్త కంపెనీ

ఏపీ అమరావతి కి పూర్వ వైభవం వస్తుంది. గత ఐదేళ్లు జగన్ పట్టించుకోని అమరావతి ని మళ్లీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు…అమరావతి ఫై పూర్తి ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే అమరావతి ఫై శ్వేతా పత్రం విడుదల చేసిన బాబు..ఇప్పుడు అమరావతి కి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఐదేళ్లు రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా..ఉన్న పరిశ్రమలు సైతం పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. ఈ తరుణంలో కొత్త పరిశ్రమలు పెట్టుబడులు పెట్టెల చూస్తున్నారు.

తాజాగా అమరావతికి శుభారంభం పలుకుతూ ఎక్స్ఎల్ఆర్ఐ (జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్) అనే సంస్థ పెట్టుబడులకు ముందుకొచ్చింది. మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌లో దేశంలోనే ఈ సంస్థకు మంచి పేరుంది. అహ్మదాబాద్ ఐఐఎం తర్వాతి స్థానం ఈ సంస్థదే. మేనేజ్‌మెంట్ కోర్సుల్లో తరగతుల నిర్వహణ, శిక్షణలో ఎక్స్ఎల్ఆర్ఐకి మంచి పేరుంది.

గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ సంస్థకు 50 ఎకరాలు కేటాయించిన సీఆర్‌డీఏ భూమిని కూడా రిజిస్టర్ చేసింది. అయితే, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి పనులకు అడ్డుపడడంతో ఎక్స్‌ఎల్ఆర్ఐ పనులు నిలిపివేసి వెనక్కి వెళ్లిపోయింది. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు సంస్థ ముందుకు వచ్చింది. కేటాయించిన భూములు అప్పగిస్తే నిర్మాణాలకు సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వానికి తెలిపింది. ఈ నేపథ్యంలో ఎక్స్ఎల్ఆర్ఐకి భూములు అప్పగించేందుకు సీఆర్‌డీఏ సిద్ధమైంది. దాదాపు రూ.250 కోట్ల వ్యయంతో భవనాలను నిర్మించనున్నారు.