హైదరాబాద్: టాలీవుడ్ నటుడు, పుష్ప 2 హీరో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో హాజరవుతున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య 70ఎంఎం థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ నేడు మరోసారి నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. ఇటీవల అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. నేటితో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుంది. అదే రోజు హైకోర్టుకు వెళ్లడంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.
ఇదే కేసులో అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ఇవ్వగా.. ఆయన లాయర్లు రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు తెలపనున్నారు. రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ విచారణ చేపట్టి, అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేయాలని కోరనున్నారు.
ఇదివరకే బాధితురాలు రేవతి కుటుంబానికి నటుడు అల్లు అర్జున్ ఆర్థిక సాయం చేశారు. అల్లు అర్జున్ రూ. 1కోటి రూపాయల చెక్ అందించగా, పుష్ప 2 దర్శకుడు సుకుమార్ రూ.50 లక్షలు, నిర్మాతలు రూ.50 లక్షలు సాయం చేశారు. వీటికి సంబంధించిన చెక్కులను ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజును అందజేశారు.