Allu Arjun to Nampally court once again

మరోసారి నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్

హైదరాబాద్‌: టాలీవుడ్ నటుడు, పుష్ప 2 హీరో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో హాజరవుతున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య 70ఎంఎం థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ నేడు మరోసారి నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. ఇటీవల అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. నేటితో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుంది. అదే రోజు హైకోర్టుకు వెళ్లడంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.

Advertisements

ఇదే కేసులో అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ఇవ్వగా.. ఆయన లాయర్లు రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు తెలపనున్నారు. రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ విచారణ చేపట్టి, అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేయాలని కోరనున్నారు.

ఇదివరకే బాధితురాలు రేవతి కుటుంబానికి నటుడు అల్లు అర్జున్ ఆర్థిక సాయం చేశారు. అల్లు అర్జున్ రూ. 1కోటి రూపాయల చెక్ అందించగా, పుష్ప 2 దర్శకుడు సుకుమార్ రూ.50 లక్షలు, నిర్మాతలు రూ.50 లక్షలు సాయం చేశారు. వీటికి సంబంధించిన చెక్కులను ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజును అందజేశారు.

Related Posts
ఎస్ఐ, లేడీ కానిస్టేబుల్ డెత్ కేసులో కొత్త ట్విస్ట్
si and constable

గురువారం వెలుగు చూసిన కామారెడ్డి జిల్లాలో ఎస్ఐ,లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ డెత్ కేసులో మిస్టరీ వీడటం లేదు. ముగ్గురూ సూసైడ్ చేసుకున్నారా లేక ఎవరైనా బ్లాక్ Read more

దువ్వాడ పై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు
Complaints against Duvvada Srinivas at several police stations

అమరావతి: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌పై దువ్వాడ Read more

Perni Nani : ఎన్ని వేధింపులకు గురిచేసినా జగన్‌ను విడిచి వెళ్లను : పేర్ని నాని
I will not leave Jagan no matter how much he harasses me.. Perni Nani

Perni Nani : వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. తనను జైలుకు పంపినా కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి Read more

TG Govt : 28 ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ రద్దు
CMRF HSP

తెలంగాణ రాష్ట్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) నిధుల దుర్వినియోగంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ కాలంలో వెలుగులోకి వచ్చిన ఈ Read more

×