సంధ్య థియేటర్ ఘటనలో అరెస్టై.. చంచల్‌గూడ జైలులో ఉన్న అల్లు అర్జున్ఈరోజు ఉదయం విడుదల అయ్యారు. జైలు నుండి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అటు నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్న ఆయనకు కుటుంబ సభ్యులు భావోద్వేగంతో ఆహ్వానించారు. బన్నీ ఇంటికి చేరుకోగానే కుమారుడు అల్లు అయాన్ పరిగెత్తుకుని తండ్రిని హత్తుకోవడం అందర్నీ కలిచివేసింది.
ఆతరువాత భార్య స్నేహ, కూతురు అర్హతో పాటు తల్లి, ఇతర కుటుంబ సభ్యులను కలుసుకుని బన్నీ ఎమోషనల్ అయ్యారు. కుటుంబం మొత్తం కలిసి ఆయనకు దిష్టి తీసి లోనికి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మీడియా తో మాట్లాడిన అల్లు అర్జున్.. సంధ్య థియేటర్ ఘటనను దురదృష్టకరమైన సంఘటనగా అభివర్ణించారు. మరొకసారి రేవతి కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని, ఎవరికీ ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకూడదని కోరారు. క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు, ఫ్రెండ్స్, సినీ పరిశ్రమ ప్రతినిధులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
మరోపక్క అల్లు అర్జున్ను రాత్రంతా జైల్లోనే ఉంచడంపై ఆయన తరఫు లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే విడుదల చేయాలని మధ్యంతర ఉత్తర్వుల్లో హైకోర్టు స్పష్టం చేసినా జైలు అధికారులు పట్టించుకోలేదంటున్నారు. ఉద్దేశపూర్వకంగానే బన్నీని జైల్లో ఉంచారని, ఇది కోర్టు ధిక్కరణే అవుతుందని చెబుతున్నారు.