వైసీపీకి షాక్‌.. ఆళ్ల నాని రాజీనామా

minister-Alla Nani

అమరావతి: వైఎస్ఆర్‌సీపీ ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి ఆళ్ల నాని పార్టీ పదవులకు.. రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు.. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు జగన్‌‌కు లేఖ రాశారు. అయితే ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదని అనుచరులు చెబుతున్నారు. అయితే ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారని అందుకే .. పార్టీ పదవులకు రాజీనామా చేశారని చెబుతున్నారు.