Alcohol prices to be reduced in AP..!

ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు..!

అమరావతి: ఏపీలోని కూటమి ప్రభుత్వం మందుబాబులకు మరో శుభవార్త చెప్పింది. ఈ మేరకు త్వరలో మరోసారి మద్యం ధరలను తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 మద్యం తయారు చేసే కంపెనీలు ఉండగా.. వాటంతట అవే వాటి బేసిక్ ప్రైజ్‌ని తగ్గించాయి. అదేవిధంగా రాష్ట్ర బెవరేజస్ సంస్థ ఆయా కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేసే ధర కూడా తగ్గించడంతో మరోసారి మద్యం ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి.

తాజా నిర్ణయంతో ఒక్కో క్వార్టర్ ఎమ్మార్పీపై రూ.30 వరకు తగ్గే చాన్స్ ఉంది. కాగా, వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం హయాంలో నాసిరకం మద్యం, ధరలను ఇష్టానుసారంగా పెంచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, రాష్ట్రంలో అనూహ్యంగా ప్రభుత్వం మారడంతో కూటమి సర్కార్ కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం మద్యం సరఫరా కంపెనీలు వాటంతట అవే తమ బేసిక్ ప్రైస్ ను తగ్గిస్తుండటంతో మద్యం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉన్న క్రమంలో మందుబాబులు పండుగ చేసుకుంటున్నారు.

Related Posts
జైలు ఊచలు లెక్కపెడుతున్న తెలుగు యూట్యూబర్
fun bhargav

తెలుగు యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌పై మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో కోర్టు 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధించింది. తీర్పు అనంతరం పోలీసులు Read more

కెనడా: యూరేనియంతో న్యూక్లియర్ ఎనర్జీ “సూపర్ పవర్”గా మారే అవకాశాలు
Canada Takes the Forefront in the Nuclear Energy Surge

న్యూక్లియర్ ఎనర్జీపై మరింత దృష్టి పెడుతున్న నేపథ్యంలో, యూరేనియం ప్రాముఖ్యత మళ్లీ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పు సంక్షోభం పరిష్కారానికి న్యూక్లియర్ ఎనర్జీ ఒక పరిష్కారం కావచ్చు Read more

అమెరికా నుంచి వెనక్కి వచ్చిన భారతీయులు
flight

అమెరికాలో నివసించే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోన్నారు. కరడుగట్టిన నేరస్తులతో సమానంగా భావిస్తోన్నారు. ఈ విషయంలో భారత్ కూడా Read more

ఆశ వర్కర్ పరిస్థితి విషయం
Asha is a matter of worker

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం, 18,000 రూపాయలు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం కోఠి డిఎంవి కార్యాలయం ముందు ఆశా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *