ప్రధాని మోదీని కలిసిన అక్కినేని కుటుంబం

ప్రధాని మోదీని కలిసిన అక్కినేని కుటుంబం

నటుడు అక్కినేని నాగార్జున తన కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఆయనతో పాటు అమల అక్కినేని, అలాగే ఇటీవల పెళ్లి చేసుకున్న కొత్త జంట నాగ చైతన్య, శోభిత ధూళిపాల కూడా ప్రధానమంత్రిని కలవడానికి పార్లమెంటును సందర్శించారు. అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్రపై రాబోయే పుస్తకం గురించి వారు మోదీతో చేర్చించినట్లు తెలుస్తుంది. వారి పర్యటన సందర్భంగా పార్లమెంటు ప్రాంగణాన్ని కూడా సందర్శించారు. సందర్శన అనంతరం వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రధాని మోదీని కలిసిన అక్కినేని కుటుంబం

ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ, అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రస్తావిస్తూ, భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలను ప్రశంసించారు. ఈ వ్యాఖ్యల తర్వాత, అక్కినేని కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీ వెనుక మరేదైనా ముఖ్యమైన కారణం ఉందా అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. సినీ రంగానికి సంబంధించి ప్రభుత్వ సహకారం గురించి కూడా వారు చర్చించి ఉండవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. మరోవైపు, నాగ చైతన్య, శోభిత ధూళిపాల కలిసి మోదీని కలవడం ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై వీరిద్దరూ ఇప్పటి వరకు స్పందించలేదు.

Related Posts
ట్యాంక్‌బండ్‌పై అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ..సీఎం రేవంత్ హాజరు
saddula bathukamma

బతుకమ్మ పండుగ చివరి అంకానికి చేరింది. చివరిదైన తొమ్మిదో రోజును సద్దుల బతుకమ్మగా నిర్వహిస్తారు. ఈరోజు రకరకాల పూలతో బతుకమ్మను పేర్చుతారు. గౌరమ్మకు నువ్వులు, పెసర్లు, వేరుశెనగలు, Read more

హైదరాబాద్‌ జూపార్క్‌లో భారీగా పెరిగిన ధరలు
hyderabad zoo park

హైదరాబాద్‌లోని ప్రసిద్ధ నెహ్రూ జంతు ప్రదర్శనశాల (జూపార్క్)లో ప్రవేశ రుసుములను మరియు వివిధ సేవల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ Read more

జాకీర్ హుస్సేన్ మృతి పట్ల చంద్రబాబు, లోకేశ్ ల సంతాపం
zakir hussain

ప్రముఖ తబలా విద్వాంసులు జాకీర్ హుస్సేన్ మృతి చెందడంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సంతాపం వ్యక్తం Read more

కేటీఆర్ కు భయం పట్టుకుంది – కాంగ్రెస్ విప్ ఆది శ్రీనివాస్
Congress VIP adisrinivas

ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతున్న.. గత పది Read more