కల్తీసారా ఎఫెక్ట్..తమిళనాడు అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం

తమిళనాడు కల్తీ సారా తాగి ఆసుపత్రి పాలైన ఘటన లో మృతుల సంఖ్య 47 కు చేరింది. దీంతో అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఘటన ఫై అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య వార్ నడుస్తుంది. తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుమాపురం గ్రామంలో మంగళవారం రాత్రి కల్తీ సారా తాగిన తర్వాత వాంతులు, విరోచనాలు , కడుపులో మంట ఇలా అనేక కారణాలతో ఇబ్బందులు పడడంతో వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ , ప్రవైట్ హాస్పటల్స్ కు తరలించారు. చికిత్స పొందుతూ మరణిస్తున్నారు. ఇప్పటివరకు 47 మంది మరణించగా..ఇంకా చాలామంది పరిస్థితి విషయంగా ఉంది. బాధితుల ఆర్తనాదాలతో ఆస్పత్రులు నిండిపోయాయి.

ఈ అంశంపై అన్నాడీఎంకే MLAలు నల్లదుస్తులు ధరించి అసెంబ్లీ ప్రాంగణంలో నిరనసలు చేపట్టారు. నిరసన తెలుపుతున్న MLAలను పోలీసులు అక్కడి నుంచి తరలించడం వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. హూచ్‌ దుర్ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ స్టాలిన్‌ CM పదవి నుంచి వైదొలగాలని అన్నాడీఎంకే డిమాండ్‌ చేసింది. జూన్‌ 24న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కే పళనిస్వామి ప్రకటించారు. కల్తీ మద్యం తయారీ, విక్రయాలు అధికార డీఎంకే కార్యకర్తల ఆదేశానుసారం జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ విచారణకు ఆదేశించాలని తమిళనాడు బీజేపీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరింది. స్టాలిన్‌ అసమర్థపాలన వల్ల కల్తీసారాకు రెండేళ్లలో 60 మందికిపైగా బలయ్యారని బీజేపీ నేత అన్నామలై ఆరోపించారు.

#WATCH | Chaos erupts both inside and outside Tamil Nadu Assembly in Chennai, as AIADMK raises the issues of Kallakurichi hooch tragedy.

The protesting MLAs are being removed by the Police. Visuals from the Assembly premises, outside the House where proceedings took place… pic.twitter.com/vmTNG6WCy0— ANI (@ANI) June 21, 2024