AI mission launched in India.. President

ఇండియాలో ఏఐ మిషన్ ప్రారంభమైంది: రాష్ట్రపతి

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ బడ్జెట్‌పై దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తొలిరోజు సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తున్నారు. తొలుత ఇటీవల మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి మన్మోహన్ సేవలను కొనియాడారు. అలాగే, మహాకుంభమేళా తొక్కిసలాటలో మృతిచెందిన భక్తులకు నివాళులర్పించారు. మహాకుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారని అన్నారు. విద్యా రంగంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు.

డిజిటల్ టెక్నాలజీ రంగంలో ప్రస్తుతం భారత్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ఇండియాలో ఏఐ మిషన్ ప్రారంభమైంది. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రారంభించాం. డిజిటల్ ఇండియాగా దేశాన్ని తీర్చిదిద్దే ప్రక్రియ కొనసాగుతోంది. యూపీఐ లావాదేవీల విధానం చూసి అభివృద్ధి చెందిన దేశాలే ముక్కున వేలేసుకుంటున్నాయి. సామాజిక న్యాయం, సమానత్వానికి మా ప్రభుత్వం డిజిటల్ టెక్నాలజీని ఓ సాధనంగా వినియోగిస్తోంది అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా కృషి చేస్తోందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.12 వేల కోట్లు కేటాయించామని తెలిపారు.

image

వక్ఫ్ బోర్డ్ సంస్కరణపై దృష్టి సారించిందని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా లక్షలాది మంది పేదల సొంతింటి కల నెరవేరబోతోందని అన్నారు. 3 కోట్ల మంది పేదలకు ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. బడ్జెట్‌లో రైతులు, మహిళలు, యువతకు ప్రాధాన్యత ఇస్తున్నాం.. భారతీయుడు అంతరిక్షంలో అడుగుపెట్టే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. ఇటీవలే ఇస్రో 100 వ ప్రయోగం విజయవంతంగా నిర్వహించింది.. అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.. ప్రభుత్వ ఉద్యోగులు కూడా మధ్య తరగతివారే కాబట్టి వారి కోసం 8వ వేతన సంఘాన్ని నియమించినట్టు తెలిపారు. త్వరలోనే భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించబోతోంది.. ఖేలో ఇండియా దేశంలో యువతకు ఎంతో ఉపయోగపడుతోంది.. ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తాచాటుతున్నారు..వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా అడుగులు పడుతున్నాయి. అని రాష్ట్రపతి తెలిపారు.

Related Posts
పెరిగేవి..తగ్గే ధ‌ర‌లు ఇవే!
nirmala

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వసారి బడ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు. ఇక ఈ బడ్జెట్ లో కేంద్రం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ప్రభుత్వం ప్రకటించిన Read more

భారత క్రికెట్ సౌరవ్ గంగూలీ బయోపిక్
భారత క్రికెట్ సౌరవ్ గంగూలీ బయోపిక్.

భారత క్రికెట్ జట్టులో సౌరవ్ గంగూలీ ఒక అద్భుతమైన ఆటగాడిగా, అలాగే కెప్టెన్‌గా కూడా తన కత్తిరాలు చూపించాడు. గంగూలీ కెప్టెన్సీలోనే భారత జట్టు విదేశీ గడ్డపై Read more

ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పులు
mat

అమెరికా ప్రతిపక్ష పార్టీ రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రతినిధి, ఫ్లోరిడా లోక్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ సభ్యుడు మ్యాట్ గేట్జ్ హౌస్‌ను విడిచిపెట్టారు. ఆయనను, రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు Read more

ప్రైవేట్ మెడికల్ కాలేజీల స్టైఫండ్ బాధ్యత రాష్ట్రాలదే : ఆర్టీఐ
ప్రైవేట్ మెడికల్ కాలేజీల స్టైఫండ్ బాధ్యత రాష్ట్రాలదే : ఆర్టీఐ

198 మెడికల్ కాలేజీలు,సంస్థలు దాని అండర్ గ్రాడ్యుయేట్ ఇంటర్న్‌లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెంట్‌లు, సీనియర్ రెసిడెంట్‌లకు స్టైపెండ్‌లు చెల్లించని సమస్యపై నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) చేతులు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *