Adjournment of hearing on Vallabhaneni Vamsi petition

వల్లభనేని వంశీ పిటిషన్‌పై విచారణ వాయిదా

వంశీతో పాటు మరో ఇద్దరు నిందితులను కస్టడీకి

అమరావతి: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్‌ విచారణను విజయవాడ కోర్టు రేపటికి వాయిదా వేసింది. టీడీపీ కార్యాలయంలో పని చేసిన సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి, దాడి చేసిన కేసులో వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. నిందితుల నుంచి కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టాలని, దీని కోసం వంశీతో పాటు మరో ఇద్దరు నిందితులను కస్టడీకి తీసుకోవాల్సి ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌పై ఇరు వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.

image

ఎస్సీ, ఎస్టీ కేసుల స్పెషల్ కోర్టులో విచారణ

ఇదిలా ఉంటే.. జైలులో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎస్సీ, ఎస్టీ కేసుల స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ను కూడా రేపటికి కోర్టు వాయిదా వేసింది. జైలులో వల్లభనేని వంశీకి అందిస్తున్న వసతుల ఏమిటో తెలియజేయాలని జైలు సూపరింటెండెంట్‌ను జడ్జి కోరారు. కాగా జైలు అధికారులు సమర్పించే వివరణ ఆధారంగా వసతుల కల్పనపై కోర్టు గురువారం నిర్ణయం తీసుకోనుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

Related Posts
Pathorol™..రొయ్యల పెంపకంలో E.H.P వ్యాధి నియంత్రణా ప్రాముఖ్యతను పరిష్కారాలను వివరించిన కెమిన్ సంస్థ
Chemin Company explains the importance of E.H.P disease control solutions in shrimp farming by introducing the scientifically proven Pathorol™

ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో రొయ్యల పెంపకంలో 73% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. రొయ్యల పెంపకంలో అత్యధిక నష్టాలు కలిగిస్తున్న E.H.P ఒక పరాన్నజీవి. మనదేశంలో రొయ్యలసాగు Read more

పోసాని అరెస్టుతో వైసీపీ నేతల్లో భయాలు
పోసాని బెయిల్ పిటిషన్ వాయిదా

ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వం కాలంలో కొన్ని కీలక రాజకీయ నాయకులు తీవ్ర రీతిలో టార్గెట్ చేయబడుతున్నారు. ఆలోచనల్లో, ముఖ్యంగా కూటమి పార్టీల నేతలపై, పోలీసులు Read more

నేటి నుండి ట్రాఫిక్‌ విధుల్లో ట్రాన్స్‌జెండర్లు
Transgender on traffic duty from today

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగంలో సోమవారం నుంచి ట్రాన్స్‌జెండర్లు విధులు నిర్వహించనున్నారని నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని కమాండ్‌ అండ్‌ Read more

డ్రగ్స్ విషయంలో రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం
CM Revanth Reddy will go to Maharashtra today

డ్రగ్స్ విషయంలో రేవంత్ సర్కార్ ముందు నుండి కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం హైదరాబాద్ నగరంలోనే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా కూడా గంజాయి , డ్రగ్స్ , Read more