ఆధార్ ఉచిత అప్డేట్ గడువు పెంపు

ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. గతంలో నిర్ణయించిన గడువు నేటితో ముగియాల్సి ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్ 14వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) వెబ్సైట్ ప్రకారం, ఆధార్ కార్డు వివరాలను సెప్టెంబర్ 14, 2024 వరకు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ సమాచారం ఆధారంగా అప్డేట్ చేసుకోవచ్చు. మీ ఆధార్ కార్డు దశాబ్దం క్రితం జారీ చేయబడి, ఇప్పటివరకు ఎప్పుడూ అప్డేట్ చేయకపోతే, దానిని తిరిగి ధృవీకరించడానికి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్లను సమర్పించాలని యూఐడీఏఐ సూచించింది.

ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకునే గడువు జూన్ 14 తో ముగుస్తుంది. అయితే, ఆ గడువును ప్రభుత్వం మరోసారి పెంచింది. ఇప్పుడు ఆధార్ కార్డు వివరాలను సెప్టెంబర్ 14వ తేదీ వరకు ఉచితంగా అప్ డేట్ చేసుకోవచ్చు. అప్డేట్ చేసుకునేందుకు UIDAI వెబ్సైట్లో ఆధార్ నంబర్, క్యాప్చా, ఓటీపీతో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్ను సమర్పించాల్సి ఉంటుంది.