Additional SP killed in hyderabad road accident

Road accident : ఘోర రోడ్డు ప్రమాదం.. అడిషనల్ ఎస్పీ దుర్మరణం

Road accident: రోడ్డు ప్రమాదంలో అడిషనల్ ఎస్పీ మృతిచెందిన ఘటన హయత్​నగర్ పోలీస్‌స్టేషన్​ పరిధిలోని లక్ష్మారెడ్డి‌పాలెం వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. హయత్‌నగర్ ​సీఐ నాగరాజు గౌడ్ కథనం మేరకు.. లక్ష్మారెడ్డిపాలెం ప్రాంతంలో నివాసం ఉండే అడిషనల్ ఎస్పీ నందీశ్వర్​బాబ్జీ (50) శనివారం తెల్లవారుజామున వాకింగ్‌కు అని వెళ్లారు. సుమారు 4.40 గంటల ప్రాంతంలో హనుమాన్​టెంపుల్ సమీపంలో హైవేను దాటుతుండగా.. అబ్దుల్లాపూర్ నుంచి హయత్‌నగర్ వైపు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్‌ నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బాబ్జీని బలంగా ఢీకొట్టింది.

Advertisements
image

నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం

ఈ దుర్ఘటనలో అతడు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆర్టీసీ బస్సు డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న నందీశ్వర్ బాబ్జీ ఇటీవలే అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ పొందినట్లుగా తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా సీఐ నాగరాజు వెల్లడించారు.

Related Posts
Supreme Court : కంచ గచ్చిబౌలి పై సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme: కంచ గచ్చిబౌలి పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

సుప్రీంకోర్టులో కంచ గచ్చిబౌలి భూ వివాదంపై తీవ్రంగా స్పందించిన ధర్మాసనం హైదరాబాద్ నగరంలోని కంచ గచ్చిబౌలి ప్రాంత భూముల వ్యవహారం రోజురోజుకీ నూతన మలుపులు తీసుకుంటోంది. ఈ Read more

ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ప్రత్యక్ష పన్ను వసూలు..
IDFC First Bank direct tax collection

ముంబై: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సిబిడిటి ), భారత ప్రభుత్వం తరపున ప్రత్యక్ష పన్ను వసూలు చేయడానికి ఆదాయపు పన్ను పోర్టల్‌తో తమ ఏకీకరణ Read more

Nagar Kurnool: విచారణలో సామూహిక అత్యాచారం ఘటన వెలుగులోకి సంచలన విషయాలు
Nagar Kurnool: విచారణలో సామూహిక అత్యాచారం ఘటన వెలుగులోకి సంచలన విషయాలు

ఆలయ ప్రాంగణంలో అఘాయిత్యం నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండపేటలో జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఆంజనేయస్వామి ఆలయానికి మొక్కులు చెల్లించేందుకు వచ్చిన ఓ Read more

వెంకటేష్, రానా, సురేష్ బాబులపై కేసు!
వెంకటేష్, రానా, సురేష్ బాబులపై కేసు!

చిత్ర పరిశ్రమలో ప్రముఖ ఉనికికి ప్రసిద్ధి చెందిన దగ్గుబాటి కుటుంబం, ఆస్తి వివాదంలో చట్టపరమైన ఎదురుదెబ్బను ఎదుర్కొంటోంది. ఆస్తిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఆదేశాలను విస్మరించి, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×