Adani topic. Opposition India Alliance MPs protest in Lok Sabha

అదానీ అంశం.. లోక్‌సభలో విపక్ష ఇండియా కూటమి ఎంపీల నిరసన

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు మంగళవారం ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి. ఈరోజు కూడా విపక్షాలు ఆందోళనకు దిగారు. గౌతమ్‌ అదానీ వ్యవహారంపై చర్చకు ఇండియా కూటమి ఎంపీలు లోక్‌సభలో ఆందోళన చేపట్టారు. ఉదయం సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంట్‌ ఆవరణకు చేరుకున్న ఇండియా కూటమిలోని పార్టీలకు చెందిన ఎంపీలు.. నిరసన తెలిపారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ , ప్రియాంక గాంధీ సహా పలువురు ఎంపీలు పార్లమెంట్‌ ముందు ఆందోళన చేశారు. ఫ్లకార్డులను చేతపట్టుకుని నినాదాలు చేశారు. ఇక సమావేశాలు ప్రారంభమయ్యాక సభలోనూ వారు ఆందోళన కొనసాగించారు.

మరోవైపు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఉభయ సభల్లోనూ ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరపడింది. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించి 75 సంవత్సరాలు అవుతున్న తరుణంలో లోక్‌సభలో, రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ జరిపేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షాలు సోమవారం ఓ అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే. రాజ్యాంగంపై లోక్‌సభలో ఈ నెల 13, 14 తేదీల్లోనూ, రాజ్యసభలో ఈ నెల 16, 17 తేదీల్లోనూ చర్చించేందుకు అంగీకారం కుదిరింది. పార్లమెంటు కార్యకలాపాలు మంగళవారం నుంచి సజావుగా జరిగేందుకు అన్ని పార్టీలు అంగీకరించాయి. గౌతమ్‌ అదానీపై అమెరికాలో కేసు, సంభల్‌ హింసాకాండ, మణిపూర్‌ అల్లర్లపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడుతుండటంతో పార్లమెంట్‌లో ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే.

Related Posts
రైల్వే స్టేషన్ లో మహిళా ప్రయాణికురాలికి తప్పిన ప్రమాదం
రైల్వే స్టేషన్ లో మహిళా ప్రయాణికురాలికి తప్పిన ప్రమాదం

బోరివలి రైల్వే స్టేషన్‌లో ఓ మహిళా ప్రయాణికురాలికి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. కదులుతున్న రైలు నుండి దిగే ప్రయత్నంలో, ఆమె అదుపు తప్పి పట్టాలపై పడబోయింది. Read more

గత ఏడాదికి మించి పెట్టుబడులు సాధిస్తాం – సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ప్రాధాన్యంగా పెట్టుకుంటున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఈ నెల 16 నుంచి 19 వరకు సింగపూర్‌లో, 20 నుంచి Read more

పాకిస్థాన్‌ ఆరోపణలపై ఘాటుగా స్పందించిన భారత్‌
India reacts strongly to Pakistan accusations

మాకు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో పాక్‌ లేదు.. జెనీవా : దాయాది దేశం మరోసారి అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై తన అక్కసు వెల్లగక్కింది. తాజాగా జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్యం Read more

మూసీపై మరోసారి స్పష్టత ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Police are a symbol of sacrifice and service. CM Revanth Reddy

సీఎం రేవంత్ రెడ్డి యాదవుల అభివృద్ధి, రాష్ట్రాన్ని అభివృద్ధి పై సదర్ సమ్మేళనంలో కీలక వ్యాఖ్యలు చేసారు.యాదవుల కోసం మరిన్ని రాజకీయ అవకాశాలను అందించడానికి ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం Read more