suriya 6

Actor Suriya: ఆమె దగ్గర నుంచి తీసుకున్న రూ.25,000 అప్పు.. తీర్చేందుకే నటుడిగా మారిన సూర్య

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య దక్షిణాది సినీ పరిశ్రమలో తన ప్రత్యేకతతో నిలిచిపోయారు ఆయన విభిన్నమైన పాత్రలు అనేక సూపర్‌హిట్ చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు సూర్య అత్యుత్తమ నటనకు గాను జాతీయ అవార్డుతో సత్కరించబడ్డారు హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ప్రేక్షకులను అలరిస్తూ సీనీ పరిశ్రమలో తనదైన ముద్రవేశారు సూర్య అనేక సందర్భాల్లో తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిన్నప్పటి నుంచి నటుడిగా మారాలని తనకు ఎప్పుడూ తలంపు రాలేదని, కానీ తన తల్లి ఋణం తీర్చుకునేందుకు మాత్రమే సినీ రంగంలోకి అడుగుపెట్టినట్లు తెలిపారు తన తండ్రి శివకుమార్ కూడా దక్షిణాదిలో ప్రముఖ నటుడు. సూర్య తల్లి దగ్గర రూ. 25 వేలు అప్పు తీసుకొని ఆ రుణాన్ని తీర్చేందుకు మాత్రమే సినిమాల్లో నటించేందుకు అంగీకరించినట్లు చెప్పారు. 1997లో ‘నెరుక్కు నాయర్’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు.

నటుడిగా మారేముందు సూర్య తన జీవితం గురించి వెల్లడిస్తూ 15 రోజులకు 750 రూపాయలు సంపాదించే గార్మెంట్ కంపెనీలో పనిచేశానని అన్నారు. అక్కడ పనిచేసే సమయంలో మూడు సంవత్సరాల తరువాత నెలకు రూ. 8 వేల జీతం వచ్చేదని, ఒకరోజు సొంత కంపెనీ పెట్టాలనే కల కూడా ఉందని వెల్లడించారు. అయితే, తల్లి పట్ల ఉన్న బాధ్యతే తనను నటుడిగా మార్చిందని చెబుతారు. ప్రస్తుతం సూర్య తన తాజా చిత్రం ‘కంగువా’ లో నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా నవంబర్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ భారీ బడ్జెట్ సినిమా పలు భాషల్లో విడుదల అవుతోంది. సూర్యకు ఈ సినిమాలో ప్రత్యేకమైన గెటప్ ఉంది, ఇది అభిమానుల అంచనాలను భారీగా పెంచింది. బాలీవుడ్ నటులు బాబీ డియోల్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు, ఈ కాంబినేషన్ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.

    Related Posts
    డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ నెట్టింట సెగలు రేపుతోందిగా
    double ismart

    పూరి జగన్నాథ్ సినిమా అంటే యువతకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.ఆయన సినిమాలు విడుదలైనప్పుడు, డైలాగ్స్ మరియు హీరో ఎలివేషన్లు కుర్రకారును జాలువారిస్తాయి. ఈ సమయంలో పూరి సినిమాల Read more

    రూట్ మార్చిన నాని.. మళ్లీ ఆ డైరెక్టర్ కే అవకాశం
    nani

    న్యాచురల్ స్టార్ నాని ఇటీవల 'దసరా' చిత్రంతో అతిపెద్ద విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రం విడుదలైన తరువాత, నాని 'హాయ్ నాన్న', 'సరిపోదా శనివారం' వంటి సినిమాలతో Read more

    ఇష్క్ చిత్రాన్ని మళ్ళీ విడుదలకు సిద్ధంగా ఉంది ఎప్పుడంటే
    ishq

    టాలీవుడ్‌లో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన యంగ్ హీరో నితిన్, జయం సినిమాతో తొలిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, అతని కెరీర్‌కు నిజమైన మలుపు ఇచ్చిన సినిమా Read more

    RC16 షూటింగ్ మొదలు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు
    RC 16 Ram Charan Janhvi Kapoor

    RC16 షూటింగ్ బాలీవుడ్‌ నటుడు శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పటి వరకు హిందీ చిత్రాలలో కొన్ని ప్రాజెక్ట్‌లను పూర్తి చేసినప్పటికీ, ఆమెకు స్టార్‌ ఇమేజ్‌ రాలేదు. Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *