ACB officials who did not allow KTR's lawyers

కేటీఆర్‌ లాయర్లను అనుమతించని ఏసీబీ..

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్న ఫార్మూలా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. బంజారాహిల్స్ ఏసిబి వద్ద కేటీఆర్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కేటీఆర్ వెంట లాయర్లను వెళ్లడానికి అనుమతించకపోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తన వెంట లాయర్లు ఎందుకు రాకుడదు అని కేటీఆర్ అధికారులను ప్రశ్నించారు. దాదాపు అరగంటపాటు అక్కడ ఎదురుచూసిన కేటీఆర్.. చివరికి ఏసీబీ ఆఫీసులోపలికి వెళ్లకుండానే వెనుదిరిగారు.

Advertisements

విచారణకు అడ్వకేట్‌కు అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీకి కేటీఆర్ న్యాయవాది నోట్ ఇచ్చారు. నోట్ తీసుకున్న ఏసీబీ అధికారులు లాయర్లను వెంట పంపించేందుకు అనుమతించలేదు. చట్ట ప్రకారం ప్రతి పౌరుడికి ఉన్నతన హక్కులను వినియోగించుకోవచ్చునని.. లాయర్లను లోపలికి అనుమతించకపోవడంపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏసీబీ ఆఫీసు నుంచి కేటీఆర్ వెళ్లిపోయారు. అటు నుంచి నేరుగా తెలంగాణ భవన్ కు వెళ్లి పార్టీ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు.

అంతకుముందు నందినగర్ లోని కేసీఆర్ ఇంటికి వచ్చిన కేటీఆర్..అక్కడ లీగల్ టీమ్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేసుకు సంబంధించి ఏసీబీ చేస్తున్న ఆరోపణలు..వాటికి చెప్పాల్సిన సమాధానాలపై వివరాలను తీసుకున్నారు కేటీఆర్. ఆ తర్వాత బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలను కేటీఆర్ కలిశారు. నాయకులతో భేటీ తర్వాత ఏసీబీ ఆఫీసుకు వెళ్లారు కేటీఆర్. 2022 జులై లో హైదరాబాద్ లో జరిగిన ఈ రేస్ లో ప్రభుత్వ నిధులను కేటీఆఱ్ విదేశీ సంస్థలకు అనుమతులు లేకుండా మళ్లించారంటూ ఆయనపై ఆరోపణలు రాగా..ప్రభుత్వం ఈ కేసులో ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఇక ఇదే కేసులో రేపు ఈడీ విచారణకు కూడా కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది.

Related Posts
Papaya : బొప్పాయిని ఏ టైంలో తినాలో తెలుసా ?
papaya

బొప్పాయి ఒక అద్భుతమైన పండు. ఇందులో విటమిన్ C, విటమిన్ A, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు మరియు జీర్ణక్రియ ఎంజైమ్‌ల వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ Read more

Telengana: రేవంత్ రెడ్డి కొత్త టీమ్‌.. కొండా సురేఖ అవుట్?
Telengana: మంత్రి వర్గంలో మార్పులు? రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు రాబోతోంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అధికార కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకునే దశకు వచ్చింది. ఉగాది పండుగకు Read more

KTR : సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నాయన్న కేటీఆర్
KTR సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నాయన్న కేటీఆర్

తెలంగాణ పక్కన బడిన కృష్ణా నది వృద్ధిగా ప్రవహిస్తుండగా, రాష్ట్రానికి మాత్రం తాగునీరు, సాగునీరు అందక Farmers అల్లాడిపోతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గళమెత్తారు. పొలాలు Read more

Bypoll : ఉపఎన్నికలకు సిద్ధంగా ఉండండి అంటూ కేటీఆర్ పిలుపు
KTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్ సంచలన ప్రకటన

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఏడాదిలో ఉపఎన్నికలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటూ అందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అత్తాపూర్ డివిజన్‌ Read more

×