ACB notices to KTR once again..!

కేటీఆర్‌కు మళ్లీ ఏసీబీ నోటీసులు..!

హైదరాబాద్‌: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి అవినీతి నిరోధక శాఖ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశముంది. కేటీఆర్ ఇచ్చిన సమాధానంపై ఏసీబీ అధికారులు లీగల్ టీం తో సమావేశమయ్యారు. ఈరోజు విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ తన న్యాయవాదులతో హాజరు కావాలని పట్టుబట్టడంతో పోలీసులు అందుకు అనుమతించలేదు. దీంతో కేటీఆర్ ఏసీబీ కార్యాలయం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. ఆయన ప్రస్తుతం తెలంగాణ భవన్ లో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. అయితే కేటీఆర్ ను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. అయితే ఎప్పుడు విచారణకు పిలుస్తారన్నది మాత్రం ఇంకా తెలియ రాలేదు. రేపు ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండటంతో రేపు పిలిచే అవకాశం లేదు.

కాగా, ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ విచారణకు హాజరు కాకుండా కేటీఆర్ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే ఏసీబీ అధికారులకు రాతపూర్వకంగా తన స్టేట్‌ మెంట్ ను ఇచ్చారు. ఇంతకీ కేటీఆర్ ఇచ్చిన ఆ లేఖలో ఏముందనేది ఇప్పుడు ఆసక్తి నెలకొంది. తన పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్ లో ఉందని.. అప్పటివరకు తాను విచారణకు హాజరు కాలేనన్నారు. తీర్పు వచ్చే వరకు తదుపరి విచారణను వాయిదా వేయాలంటూ కేటీఆర్ ఆ లేఖలో వెల్లడించారు. ఈ క్రమంలోనే కేటీఆర్ ఇచ్చిన లేఖ ఆధారంగా ఏసీబీ మరోసారి నోటీసులు సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఇప్పటికే ఈ కేసులో 2025 జనవరి 07వ తేదీన విచారణకు రావాలంటూ ఈడీ సైతం కేటీఆర్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద ఈడీ విచారణ చేపట్టింది. ఫెమా నిబంధనలను ఉల్లఘించినట్టుగా గుర్తించిన ఈడీ కేసును దర్యాప్తు చేపట్టింది. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న అరవింద్‌ కుమార్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డిలు మాత్రం ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. డుమ్మా కొట్టారు. దీంతో ఈడీ వీరికి విచారణకు రావాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. 08వ తేదీన బీఎల్‌ఎన్‌ రెడ్డి, 09వ తేదీన అరవింద్‌ కుమార్‌ను హాజరు కావాలని ఆదేశించింది. మరి ఈ సారైనా హాజరు అవుతారో లేదో చూడాలి.

Related Posts
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. ఆధిక్యాల్లో బీజేపీ జోరు..
Delhi election results.. BJP strength in the lead

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 11 జిల్లాల్లోని 19 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి Read more

గాలిపటాలు ఎగురవేయవద్దు: డిస్కం
గాలిపటాలు ఎగురవేయవద్దు డిస్కం

తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టిజిఎస్పిడిసిఎల్) అధికారులు విద్యుత్ లైన్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో గాలిపటాలు ఎగురవేయవద్దని ప్రజలను హెచ్చరించారు, ఇది ప్రమాదకరమైన Read more

నేడు బీఆర్ఎస్ ‘బీసీ’ సమావేశం
BRS BC

తెలంగాణలో బీసీల హక్కులను పరిరక్షించేందుకు బీఆర్‌ఎస్ కీలక చర్యలు చేపడుతోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం పోరాడాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా, భవిష్యత్తు Read more

అదానీపై US కోర్టు కేసులో ఊహించని ట్విస్ట్
adani news

అదానీపై అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు కేసులో మరో టర్న్. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్పై US DOJ లంచం, అవినీతి అభియోగాలు నమోదే చేయలేదని Read more