Aarogyasri : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఏపీలో ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ వైద్య సేవలు ఈరోజు నుండి బంద్ అయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ వైద్య సేవలు బంద్ కానున్నాయి అంటూ.. ఆరోగ్యశ్రీ కింద పని చేస్తున్న ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటన చేశాయి. దాదాపు 3500 కోట్ల పెండింగ్ బిల్స్ చెల్లించాలని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 600 ఆసుపత్రులలో అన్ని వైద్య సేవలు బంద్
తమ బిల్లులు వచ్చేవరకు ఆరోగ్యశ్రీ సేవలు.. బందు చేస్తున్నట్లు ప్రకటన చేశాయి. ఎమర్జెన్సీ సేవలు మాత్రమే ఏపీలో కొనసాగులున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో ఏపీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 600 ఆసుపత్రులలో ఓపిలతో పాటు అన్ని వైద్య సేవలు కూడా ఆగిపోయాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం సుమారు 2500 కోట్ల రూపాయల వరకు బకాయిలు పెట్టిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
నెల ముందే ప్రభుత్వానికి సమ్మె నోటీస్
కాగా, నెట్‌వర్క్ ఆస్పత్రులకు పెద్ద ఎత్తున బకాయిలు చెల్లించకపోవడంతో నిర్వహణ కష్టంగా మారి సేవలు కొనసాగించే పరిస్థితి లేదని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) నెల ముందే ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చింది. రూ.1,500 కోట్లు విడుదల చేస్తే గానీ సేవలు అందించలేమని పేర్కొంది. బకాయిల కోసం ఆశా ప్రతినిధులు ప్రభుత్వానికి ఏడాది కూడా తిరగకుండానే 26 సార్లు లేఖ రాయడం గమనార్హం.
Read Also: నేడు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం