తిరుమలలో యువతిపై విరిగిపడ్డ చెట్టు కొమ్మ… తీవ్రంగా గాయాలు

A tree branch fell on a young woman in Tirumala

తిరుమల: తిరుమల శ్రీవారి సన్నిధిలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమలలో దేవుడి దర్శనానికి వెళ్లిన యువతి గాయాలపాలయ్యింది. తిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయ స్వామి దర్శనం కోసం ఓ యువతి వెళ్తున్నది. ఈ క్రమంలో ఆమెపై ఒక్కసారిగా చెట్టు కొమ్మ విరిగి పడింది. దీంతో ఆమె కుప్పకూలిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను హుటాహుటిన ఆమెను దవాఖానకు తరలించారు. తల, వెన్నెముకకు తీవ్రగాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. బాధితురాలి వివరాలు తెలియాల్సి ఉన్నది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

కాగ, ఇదంతా మరో యువకుడు వీడి యో తీశాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో పలువురు నెటిజన్లు టీటీడీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వీడియోలపై టీటీడీ తీవ్రంగా ఖండించిం ది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రాంక్‌ వీడియోలు తీసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించిం ది. తిరుమల ఆలయంలోకి ఫోన్‌ ఎలా తీసుకెళ్లారు? అనేది తెలియాల్సి ఉంది.