tiger

ఆలుబాక శివారులో పెద్దపులి సంచారం

వెంకటాపురం మండలం ఆలుబాక శివారులో పెద్దపులి సంచరిస్తున్న వార్త స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ఆలుబాక-బోధాపురం మార్గంలో గోదావరి పాయ దగ్గర పులి అడుగుల జాడలు కనిపించడంతో రైతులు అప్రమత్తమయ్యారు. మిర్చి తోటల వద్దకు వెళ్లే రైతులు పులి సంచారంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి పుచ్చపంట దగ్గర పులి అరుపులు వినిపించాయన్న సమాచారంతో గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. స్థానికులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు మంగళవారం ఘటనా స్థలానికి చేరుకొని పులి అడుగులను పరిశీలించారు.

Advertisements

అధికారుల పరిశీలన ప్రకారం.. ఇది పెద్దపులి అడుగులే అని నిర్ధారణకు వచ్చారు. పులి ఆహారం కోసం సమీప గ్రామాల్లోకి రావచ్చని వారు పేర్కొన్నారు. పులి సంచారం కారణంగా రైతులు రాత్రి పంట పొలాల్లో ఉండడానికి భయపడుతున్నారు. పులి అడుగులు గుర్తించి దానిని అడవిలోకి తరలించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్థానికులకు అవసరమైన సూచనలు అందిస్తున్నారు. రాత్రి వేళల్లో ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురవకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు.

Related Posts
Ugadi : ఉగాది పచ్చడి రుచులలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు !
The health secrets hidden in the flavors of ugadi pachadi !

Ugadi : కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ, ఆధ్యాత్మికతను పెంపొందించుకునే పండుగ ఉగాది. ఈ పండుగ రోజు చేసుకునే ఉగాది పచ్చడి షడ్రుచులతో కూడి ఆరోగ్యానికి మేలు Read more

2026 నాటికి నక్సలిజాన్ని నిర్ములించాల్సిందే : అమిత్‌ షా ప్రకటన
Amit Shah is going to visit AP

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026 నాటికి నక్సలిజాన్ని నిర్ములించాల్సిందేనని Read more

పాట్నాలో అల్లు అర్జున్, రష్మిక మందన్న ‘పుష్ప 2’ ట్రైలర్ లాంచ్: అభిమానుల హంగామా
PUSHPA 2 1

బీహార్ రాష్ట్రం, పాట్నాలో అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న నటించిన 'పుష్ప 2: ది రూల్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సంచలనంగా మారింది.. ఈ ఈవెంట్ Read more

గ్రూప్‌-2 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : చంద్రబాబు
మేలో తల్లికి వందనం.. చంద్రబాబు కీలక ప్రకటన

రోస్టర్‌ విధానంపై అభ్యర్థులు 3 రోజులుగా ఆందోళన అమరావతి: ఏపీలో గ్రూప్-2 పరీక్షలపై గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. Read more

×