A plane narrowly missed a major accident in Shamshabad! copy

శంషాబాద్‌లో విమానానికి తప్పిన పెను ప్రమాదం!

హైదరాబాద్‌: శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఘోర విమానం ప్రమాదం తప్పింది. పైలట్‌ అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. లేదంటే రెండు విమానాలు ఒకదానికొకటి ఢీకొని అనుకోని ప్రమాదం జరిగేది. ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ 6E-6973 విమాన సర్వీస్‌ 150 మంది ప్రయాణికులతో గోవా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మీదుగా వైజాగ్‌ ఎయిర్‌పోర్టుకు బయలుదేరింది.

Advertisements
శంషాబాద్‌లో విమానానికి తప్పిన పెను

పైలట్‌ విమానం హైడ్రాలిక్‌ గేర్‌ను సిద్ధం

ఈ క్రమంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులు ఫైట్ ల్యాండింగ్‌ చేయడానికి ఏటీసీ అధికారులు అనుమతించారు. దీంతో పైలట్‌ విమానం హైడ్రాలిక్‌ గేర్‌ను సిద్ధం చేశాడు. ఏటీసీ నుంచి క్లియరెన్స్ రావటంతో.. పైలట్ విమాన సర్వీస్‌ను డౌన్‌ చేశాడు. అయితే అప్పటికే రన్‌వేపై టేకాఫ్‌ తీసుకోవడానికి మరో విమానం సిద్ధంగా ఉంది. దాన్ని గమనించిన పైలట్ అప్రమత్తమయ్యాడు. వెంటనే తన విమానాన్ని గాల్లోకి లేపాడు. దీంతో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. రన్‌వేపై ఉన్న విమానం వెళ్లేంత వరకు 10 నిమిషాలపాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. అనంతరం పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్‌ చేశాడు. దీంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ విమాన సర్వీస్‌ వైజాగ్‌కు వెళ్లిపోయింది.

ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్

గత 20 రోజుల క్రితం కూడా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్టు వస్తోన్న క్రమంలో కార్గో ఫ్లైట్ ల్యాండింగ్ గేర్‎లో టెక్నికల్ లోపం తలెత్తింది. వెంటనే అలర్ట్ అయిన పైలట్ శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారం అందించాడు. ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్‎కు అనుమతి ఇవ్వాలని కోరాడు. దీంతో విమాశాశ్రయం ఏటీసీ అధికారులు ఇతర విమానాలను ఆపి వెంటనే కార్గో ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్‎కు పర్మిషన్ ఇచ్చారు.

Related Posts
Hyderabad:పెట్రోల్ పోసి భార్యను హతమార్చిన భర్త
Hyderabad:పెట్రోల్ పోసి భార్యను హతమార్చిన భర్త

అనుమానం ఒక కుటుంబాన్ని నాశనంచేసింది.భార్యను కోల్పోయేంత పరాకాష్టకు ఓ భర్త చేరుకున్నాడు.హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినా, చివరకు పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ Read more

Narendra Modi : శ్రీలంక టీమ్ తో ప్రధాని మోదీ ముచ్చట్లు
Narendra Modi శ్రీలంక టీమ్ తో ప్రధాని మోదీ ముచ్చట్లు

శ్రీలంక పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఓ ప్రత్యేక సంఘటనకు సాక్షిగా నిలిచారు.1996 వన్డే వరల్డ్ కప్ గెలిచిన శ్రీలంక క్రికెట్ జట్టును ఆయన ప్రత్యేకంగా Read more

వెంకీమామ ఏంటి ఈ రికార్డ్స్ …సంక్రాంతి మొత్తం నీదే..!
SKV firstweek

వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఫామిలీ & యాక్షన్ డ్రామాగా Read more

రెపోరేటు తగ్గింపుతో మీ EMI ఎంత తగ్గుతుందో తెలుసా..?
Home loan repo down

బ్యాంకింగ్ రంగంలో కీలకమైన పరిణామంగా రిపో రేట్ తగ్గింపు వల్ల రుణ గ్రహీతలకు అనేక ప్రయోజనాలు అందనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజా నిర్ణయంలో Read more

×