chandra babu

ఆంధ్రాకు భారీ ప్రాజెక్ట్: చంద్రబాబు ట్వీట్

దావోస్‌లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. రెండ రోజు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో చంద్రబాబు వరుస సమావేశాలు జరిగాయి. వివిధ సంస్థల ప్రతినిధులతో 15కు పైగా సమావేశాల్లో చంద్రబాబు ముఖాముఖి భేటీలు నిర్వహించారు. గ్రీన్ హైడ్రోజన్ – గ్రీన్ మాన్యుఫాక్చరింగ్, నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్, ఎనర్జీ ట్రాన్సిషన్, బ్లూ ఎకానమీ సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలకు చంద్రబాబు హాజరుకానున్నారు. సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాన్ కిమ్ యాంగ్, యూఏఈ ఎకానమీ మినిస్టర్‌తోనూ భేటీ అవుతారు.
వెల్స్‌పన్ చైర్మన్ బీకే గోయింకా, ఎల్జీ కెమ్ సీఈవో షిన్ హక్ చియోల్, కార్ల్స్‌బెర్గ్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్, టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, వాల్‌మార్ట్ ప్రెసిడెంట్-సీఈవో కాత్ మెక్‌లే, సిస్కో సీఈవో చుక్ రాబిన్స్, కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ తదితరులతో పెట్టుబడులపై చర్చించనున్నారు.
దావోస్‌లో మిట్టల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్‌, సీఈవో ఆదిత్య మిట్టల్‌తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ సమావేశమయ్యారు. ఆర్సెలర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ సంయుక్తంగా 17.8 మిలియన్ టన్నుల కెపాసిటీతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయడానికి ఇప్పటికే అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే అంశంపై ముఖ్యమంత్రి బృందం చర్చలు జరిపింది.
అనకాపల్లిలో 17.8 మిలియన్ టన్నుల కెపాసిటీతో ఆర్సెలార్ మిత్తల్‌, జపాన్‌కు చెందిన నిప్పాన్ స్టీల్ జేవీ సంయుక్తంగా గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్ట్‌ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిన విషయాన్ని లక్ష్మీమిత్తల్‌ గుర్తు చేశారు. ఆర్సెలార్‌ మిత్తల్‌, నిప్పాన్‌ స్టీల్‌ ప్లాంట్ అనకాపల్లిలో ఏర్పాటు చేసేది అతిపెద్ద ప్రాజెక్టు అన్నారు. ఇది అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు.

Related Posts
రామ్ గోపాల్ వర్మపై మ‌రో కేసు
varma

డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తన సినిమాలతోనే కాకుండా మీడియా, సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అయితే ఇందులో రాజకీయ నాయకులపై చేసే Read more

కెనడా ఆల‌యంలో హిందువులపై దాడి పై పవన్ రియాక్షన్
Deputy CM Pawan visit to Dwaraka Tirumala today

కెనడాలోని బ్రాంప్టన్‌ హిందూ ఆలయంపై ఖలిస్థానీ మద్దతుదారులు చేసిన దాడి పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనను Read more

సైబర్ ఉచ్చులో పడి నగదు కోల్పోయిన మహిళ
Cyber Crime

సైబర్ ఉచ్చులో పడి నగదు కోల్పోయిన మహిళ .మహిళా ఖాతానుండి 17 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు.తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దనలక్ష్మీనగర్ లోచోటు చేసుకున్న Read more

షర్మిల, విజయమ్మలపై జగన్ పిటిషన్ విచారణ వాయిదా..
jagan sharmila clash

వైసీపీ అధినేత జగన్ తన కుటుంబ ఆస్తుల విషయంలో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దాఖలు చేసిన పిటిషన్ రాజకీయ, కుటుంబ సవాళ్ళను తెరపైకి తీసుకొచ్చింది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *