ఏపీ లో మరో భారీ పెట్టుబడి వచ్చింది.లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ రాష్ట్రంలో రూ.5,000 కోట్ల పెట్టుబడితో బల్క్ డ్రగ్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 7,500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.యువతకు ఉద్యోగాలు కల్పించడానికి ఇలాంటి ప్రాజెక్టులు అవసరం.
గ్రీన్ కెమిస్ట్రీ
అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలంలో గల గోరపూడిలో లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ రూ.5,000 కోట్లతో బల్క్ డ్రగ్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు.ఇక్కడ ఫేజ్-2 సెజ్ భూముల్లో ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తారు.లారస్ సంస్థ 2007 నుంచి విశాఖ పరిసర ప్రాంతాల్లో రూ.6,500 కోట్లు పెట్టుబడి పెట్టింది,యూనిట్లు స్థాపించారు. వీటి ద్వారా సుమారు 7,500 మందికి ఉపాధి లభిస్తోంది. గోరపూడిలో కొత్త యూనిట్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందించనుంది.లారస్ సంస్థ సీఈవో చావా సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారావు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ యూనిట్ ద్వారా ఫర్మెంటేషన్, క్రాప్ సైన్స్ కెమికల్స్, గ్రీన్ కెమిస్ట్రీ వంటి ప్రత్యేక రసాయనాలను తయారు చేస్తుందన్నారు చంద్రబాబు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వేగంగా కల్పించాలని భూ కేటాయింపులతోపాటు అన్నివిధాలా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. సాధ్యమైనంత త్వరగా నిర్మాణ పనులు ప్రారంభించాలి అన్నారు.
సీబీజీ ప్లాంట్
ఏపీలో భారీగా పెట్టుబడులు వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఏపీ సర్కార్ ముందుకు సాగుతోంది.రాష్ట్రంలో చట్టాలు ఉల్లంఘించిన వారిని, ప్రభుత్వ ప్రాజెక్టులపై తప్పుడు ప్రచారం చేసేవారిని రెడ్‌బుక్‌లో వేస్తామని హెచ్చరించారు మంత్రి నారా లోకేష్ . కనిగిరి నియోజకవర్గం నుంచి చాలా మంది ప్రజలు వలస వెళుతున్నారనిఅక్కడ రిలయన్స్ సీబీజీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరువు ప్రాంతంలో యువతకు ఉద్యోగాలు కల్పించడానికి ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొస్తుంటే ప్రతిపక్ష నాయకులకు ఎందుకు కడుపు మంట అన్నారు.రెడ్‌బుక్ పేరు వినగానే ప్రతిపక్ష నాయకులు భయపడుతున్నారని,అభివృద్ధిలో పోటీ పడలేక కులం,మతం పేరుతో గొడవలు సృష్టిస్తున్నారని,పాస్టర్ ప్రవీణ్ మరణంపై జరుగుతున్న దుష్ప్రచారమే దీనికి ఉదాహరణ అన్నారు.ఈ విషయంలో ప్రభుత్వం నిజాయితీగా దర్యాప్తు చేస్తోందని, ఈ విషయంలో తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.ఏపీలో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్స్ పెట్టడానికి రిలయన్స్ ముందుకు వచ్చింది. ఈ రంగంలో 65 వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. దీని ద్వారా 500 ప్లాంట్లు పెట్టడానికి రిలయన్స్ ముందుకు వచ్చింది. తద్వారా 2.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, కడపలో 5 లక్షల ఎకరాల బీడు భూమిని వినియోగంలోకి తీసుకురాబోతున్నాం.యువగళం సమయంలో ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాను.రిలయన్స్ మొదటి సీబీజీ ప్లాంట్ ను కనిగిరిలో ప్రారంభించాను. ప్రకాశం జిల్లాలో ఐదు వేల ఎకరాలు బీడు భూములు ఇచ్చాం. కనిగిరిలో 497 ఎకరాలు కేటాయించాం. కనిగిరి ప్లాంట్ రిలయన్స్ సీబీజీ ప్లాంట్ హబ్ గా మారబోతుంది. ఇక్కడే ఐదు ప్లాంట్స్ రాబోతున్నాయి.