కుప్పంలోని అమెజాన్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం..లక్షల్లో ఆస్తి నష్టం

కుప్పంలోని అమెజాన్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సంస్థకు లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యాజమాన్యం తెలిపింది. వివరాల్లోకి వెళ్తే..చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కు చెందిన గోడౌన్ లో షార్ట్ సర్కూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

ప్రమాదం జరిగిన సమయంలో గోడౌన్ లో విలువైన పార్శిల్స్ ఉండగా, అవి అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, ఈ అగ్నిప్రమాదంలో రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు గోడౌన్ సిబ్బంది వెల్లడించారు.