A huge fire broke out in Parawada Pharmacy

పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం

అనకాపల్లి : ఏపీ అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో కెన్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో కార్మికులు,స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

image

పరవాడ ఫార్మాసిటీలో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాల గురించి కార్మికులు,స్థానికులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలే 2024 నవంబర్ 2, డిసెంబర్ 22 తేదీల్లో భారీ అగ్ని ప్రమాదాలే జరిగిన విషయం తెలిసిందే. మళ్లీ నెల రోజులు కూడా గడవకుండానే మరో అగ్ని ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

Related Posts
తిరుమల భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి
tirumala devotees

తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వచ్చే భక్తుల ఆరోగ్యంపై టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) కీలక సూచనలు జారీ చేసింది. ఇటీవల కాలంలో గుండె సంబంధిత ఆరోగ్య Read more

పుష్ప 2: అదనపు 20 నిమిషాల ఫుటేజీతో రీలోడ్
పుష్ప 2: అదనపు 20 నిమిషాల ఫుటేజీతో రీలోడ్

టాలీవుడ్‌లోని అతిపెద్ద బ్లాక్‌బస్టర్ పుష్ప 2: ది రూల్ ఇప్పుడు ప్రేక్షకులకు మరింత ఆసక్తికరమైన అనుభూతిని అందించబోతోంది. ఈ చిత్రానికి మరో 20 నిమిషాల అదనపు ఫుటేజీ Read more

ఏపీ వాలంటీర్ల కీలక నిర్ణయం
volunteers

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు అంతా సీఎంను కలిసేందుకు ఈ నెల 17న అమరావతి రానున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. ఇప్పటివరకూ తమకు పెండింగ్ Read more

ఏపీలో మగవారికీ పొదుపు సంఘాలు.. నిబంధనలు ఇవే
Men's Savings

ఇప్పటి వరకు మహిళలకు మాత్రమే పరిమితమైన పొదుపు సంఘాలను ఇప్పుడు మగవారికీ విస్తరించేందుకు మెప్మా (MEPMA) చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయడానికి అధికారులు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *