kodi pandalu bari

మురమళ్లలో 30 ఎకరాల లే అవుట్‌లో భారీ బరి..

సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందేల హంగామా ఊపందుకుంది. డాక్టర్ బీఆర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలంలోని మురమళ్ల గ్రామంలో 30 ఎకరాల లే అవుట్‌లో భారీ బరిని ఏర్పాటు చేశారు. ఈ బరికి సంబంధించిన ఏర్పాట్లను ప్రత్యేకంగా తెలంగాణకు చెందిన ఓ సంస్థ చేపట్టింది. దాదాపు రూ. కోటి ఖర్చు చేసి నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. ఈ బరిలో పాల్గొనడానికి ఎంపిక చేసిన వారికి మాత్రమే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

మురమళ్ల బరిని ప్రత్యేకంగా ఫ్లడ్ లైట్లు, డ్రోన్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణతో ఏర్పాటుచేశారు. అతిథుల కోసం వంటగాళ్లను తీసుకువచ్చి ప్రత్యేక వంటకాలు అందిస్తున్నారు. అటు, పక్కనే మద్యం దుకాణాలను కూడా ఏర్పాటు చేసేందుకు ఒప్పందాలు పూర్తయ్యాయి. సముద్రతీర ప్రాంతమైన యానాం, ఆత్రేయపురం ప్రాంతాల్లో సైతం పందేల హంగామా కొనసాగనుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో విద్యుత్ దీపాలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు, ప్రత్యేక గ్యాలరీలతో బరులను రూపొందించారు. పందేలు చూడటానికి వచ్చే వీరాభిమానుల కోసం ప్రత్యేక ప్రవేశ పాస్‌లు, ఫుడ్ టోకెన్లు ముద్రించారు. వీఐపీలకు ప్రత్యేక మార్గాల్లో ప్రవేశం కల్పించారు. కొన్ని బరుల్లో టాస్ వేసేందుకు గోల్డ్ కాయిన్లు సిద్ధం చేసినట్లు సమాచారం.

కృష్ణా జిల్లా బాపులపాడు, కంకిపాడు మండలాల్లో భారీ ఎత్తున బరులను ఏర్పాటు చేశారు. అంపాపురం, ఉప్పులూరు ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు, ఇనుప ఊచలు, రేకుల షెడ్లతో పందేల ప్రాంగణాలను తీర్చిదిద్దారు. అంపాపురంలో ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయడం విశేషం. ఉప్పులూరులో వేయించిన బరికి వేంకటేశ్వర స్వామి ఆలయ నమూనా ఆకర్షణగా నిలుస్తోంది. పందేల నిర్వహణలో రాజకీయ పార్టీల ప్రాధాన్యత కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి బరికి సంబంధించి ప్రజాప్రతినిధుల ఫ్లెక్సీలు ప్రత్యక్షమవుతున్నాయి. పందేల ద్వారా రూ. వందల కోట్ల వ్యాపారం జరగనుందని ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీల నేతల మధ్య ఆధిపత్య పోరు కూడా ఈ కోడి పందేల సందర్భంలో వెలుగులోకి వస్తోంది. సంక్రాంతి పండుగకు కోడి పందేలు ప్రత్యేకమైన ఉత్సాహాన్ని తెచ్చిపెడుతుండగా, ఆ ఉత్సవాలు మరింత దుమ్ము రేపుతున్నాయి.

Related Posts
దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
AP Govt is good news for disabled people

ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్..ప్రజలకు వరుస తీపి కబుర్లు తెలియజేస్తూ వారిలో ఆనందాన్ని , ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచుతుంది. ఓ పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలను Read more

అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండించిన జగన్
Allu arjun jagan

'పుష్ప-2' మూవీ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ Read more

దుర్గ‌మ్మ ను దర్శించుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్
pawan durgamma

దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. కూతురు ఆద్యతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు పండితులు, అధికారులు Read more

రాష్ట్రంలో పెరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు – మంత్రి కోమటిరెడ్డి
telangana minister komatire

తెలంగాణ రాష్ట్రంలో జనగణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశముందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ పునర్విభజనతో రాష్ట్రానికి కొత్తగా 34 అసెంబ్లీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *