భారతదేశంలో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రగతి సాధిస్తున్నాయి. ముఖ్యంగా ఈవీ స్కూటర్లు అమ్మకాలు జోరుగా పెరిగాయి. ఈ నేపథ్యంలో, మధ్యతరగతి వినియోగదారులకు అనువుగా ఉండే కొత్త ఫీచర్లతో అనేక ఈవీ స్కూటర్లు లాంచ్ అవుతున్నాయి. ఇటీవల ఆటో ఎక్స్‌పో-2025లో ప్రముఖ కంపెనీ ఫెర్రాటో డీఫై-22 పేరుతో సూపర్ ఈవీ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది.ఫెర్రాటో డీఫై-22 స్కూటర్ గురించి తెలుసుకుందాం. ఓపీజీ మొబిలిటీ గతంలో ఒక చిన్న ఈవీ కంపెనీగా ఉన్నా, ఇప్పుడు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో-2025లో ఫెర్రాటో డీఫై-22 స్కూటర్‌ను ప్రారంభించింది. ఈ మోడల్ ప్రారంభ ధర ₹99,999 (ఎక్స్-షోరూమ్). జనవరి 17, 2025 నుండి ₹499తో ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.ఈ స్కూటర్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంది. సైడ్ ప్యానెల్‌పై కంపెనీ బ్యాడ్జింగ్‌తో పాటు ఎక్స్‌టెండెడ్ ఫ్రంట్ ఆప్రాన్ కనిపిస్తుంది.
ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, డ్యూయల్-లెవల్ ఫ్లోర్ బోర్డ్, సైడ్ ప్యానెల్‌పై లైన్స్, సింగిల్-పీస్ గ్రాబ్ రైల్ మరియు టెయిల్ ల్యాంప్ ఈ స్కూటర్ ప్రత్యేకతగా ఉన్నాయి.ఫెర్రాటో డీఫై-22 స్కూటర్ 1.2 కేడబ్ల్యూహెచ్ మోటారుతో పనిచేస్తుంది. గరిష్టంగా 70 km/h వేగం సాధించగలిగే ఈ స్కూటర్, 80 km పరిధి కలిగిన ఐసీఏటీ-సర్టిఫైడ్ జ్యూస్డ్ బ్యాటరీతో పాటు వస్తుంది. ఈ స్కూటర్ 2.2 కేడబ్ల్యూహెచ్ ఎల్ఎఫ్‌పీ బ్యాటరీతో పనిచేస్తుంది.స్కూటర్‌లో మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి: ఎకో, సిటీ మరియు స్పోర్ట్స్ మోడ్స్. 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ప్, 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే ఈ స్కూటర్‌ను మరింత ప్రత్యేకంగా చేస్తాయి.
ఫెర్రాటో డీఫై-22 స్కూటర్‌లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, మ్యూజిక్ ప్లేబ్యాక్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. సస్పెన్షన్ వ్యవస్థ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక డ్యూయల్ షాక్ అబ్జార్బర్లతో ఉంటుంది. స్కూటర్‌లో డిస్క్ బ్రేక్స్‌ను ఉపయోగించి వేగం నియంత్రించవచ్చు.ఈ స్కూటర్ 25 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కెపాసిటీతో కూడుకున్నది. ఫెర్రాటో డీఫై-22 7 డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది: షాంపైన్ క్రీమ్, బ్లాక్ ఫైర్, కోస్టల్ ఐవరీ, యూనిటీ వైట్, రెసిలెన్స్ బ్లాక్, డోవ్ గ్రే మరియు మ్యాట్ గ్రీన్. అయితే, బుకింగ్స్ ప్రారంభమైనప్పటికీ, ఈ స్కూటర్ డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.