kid food

ప్రభుత్వాన్ని కదిలించిన ఓ చిన్నారి కోరిక

అంగన్వాడీలో మెనూపై ఓ చిన్నారి కోరిక రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించింది. రాష్ట్ర వ్యాప్తంగా మార్పులకు నాంది కాబోతోంది. ఆ చిన్నారి మాటలకు మంత్రి స్పందించి తగు చర్యలు ఆదేశించడానికి కారణమైంది. ఉప్మాకు బదులుగా బిర్యానీ, చికెన్ ఫ్రై కావాలని అమాయకంగా అడుగుతోన్న ఓ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ఏకంగా ప్రభుత్వ పెద్దలనే ఆలోచనలో పడేసింది. దీంతో కేరళలోని చిన్నారుల సంరక్షణ కేంద్రాల మెనూలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు కేరళ ఆరోగ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి వీణా జార్జ్ స్పందించారు. వైరల్ అవుతోన్న వీడియోలో టోపీ ధరించిన త్రాజుల్ ఎస్ శంకర్(శంకు) అనే బాలుడు ఇంటి వద్ద చేసిన బిర్యానీ తింటూ అమాయకంగా తన తల్లిని.. ‘నాకు అంగన్వాడీలో ఉప్మాకు బదులుగా బిర్నానీ (బిర్యానీ) పోరిచా కోజి (చికెన్ ఫ్రై) కావాలి’ అని అడగటం వినిపిస్తోంది. బుజ్జిబుజ్జి మాటలకు మురిసిపోయిన తల్లి.. దానిని వీడియో తీశారు.

ఆ వీడియో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది మంత్రి వీణ జార్జ్ దృష్టిలో పండింది. దీంతో ఆమె తన ఫేస్‌బుక్ పేజ్‌లో ఆ వీడియోను షేర్ చేశారు. ఆ చిన్నారి అమాయకంగా చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు ఆమె చెప్పారు. అంతేకాదు, మెనూను సమీక్షిస్తామని తెలిపారు. ఇక, ఆ చిన్నారి వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బాలుడికి మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే స్వయంగా తామే బిర్యానీ పంపుతామని ఆఫర్ ఇస్తున్నారు. అంతేకాదు, జైళ్లలో ఖైదీలకు అందించే ఆహారాన్ని తగ్గించాలని, అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు మెరుగైన పోషకాహారం అందించాలని మరి కొందరు సూచించారు. ఈ నేపథ్యంలో మంత్రి వెంటనే స్పందించి, మెనూపై రివ్యూ చేయాలని ఆదేశాలు జారీ చేయడాన్ని ప్రశంసిస్తున్నారు.

Related Posts
ఉద్యోగులకు షాకిచ్చిన ఇన్ఫోసిస్
ఉద్యోగులకు షాకిచ్చిన ఇన్ఫోసిస్

దేశంలోని టార్ సెకెండ్ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్. టీసీఎస్ తర్వాత ఐటీ సేవల రంగంలో అతిపెద్ద సంస్థగా అవతరించిన కంపెనీ ఇటీవల తన ఉద్యోగులకు వేతన పెంపులకు Read more

ప్రశాంత్ కిషోర్‌తో విజయ్ కీలక భేటీ!
ప్రశాంత్ కిషోర్‌తో విజయ్ కీలక భేటీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి ప్రధాన పార్టీలన్నీ కసరత్తు మొదలు పెట్టారు. అధికార, విపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తాజాగా తమిళగ Read more

మహాకుంభ మేళా పవిత్ర స్నానాల తేదీలు
kumbh mela

మహాకుంభ మేళాకు తుది ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 45 కోట్ల మంది భక్తులు హాజరయ్యే ఈ భారీ కార్యక్రమం కోసం సుమారు రూ 7500 కోట్లు ఖర్చు Read more

భారతదేశంలో విమానయాన రంగంలో మార్పులు అవసరం: రాఘవ్ చద్దా
raghavchadha

రాజ్యసభ ఎంపీ, రాఘవ్ చద్దా, "విమాన టిక్కెట్లు ఇప్పుడు చాలా ఖరీదైనవి మరియు సాధారణ ప్రజలకు విమాన ప్రయాణం ఒక కలగా మారింది. విమానాశ్రయాలలో రద్దీని బస్ Read more