సీనియర్ నటుడు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. మొన్న జరిగిన ఘర్షణలో TV9 రిపోర్టర్ పై దాడి చేసినందుకు పహాడీ షరీఫ్ పోలీసులు ఆయనపై మొదట బీఎన్ఎస్ 118 సెక్షన్ కింద FIR నమోదు చేశారు. అయితే నేడు లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆ కేసును బీఎన్ఎస్ 109 సెక్షన్ కిందAttempt to Murder గా మార్చారు.
ఈ ఘటన సినీ పరిశ్రమలో కలకలం రేపింది. TV9 రిపోర్టర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. కేసు నమోదు తర్వాత మోహన్ బాబు సమర్థించుకోలేదని సమాచారం. మరోవైపు, ఘర్షణలో గాయపడ్డ మోహన్ బాబు ప్రస్తుతం బంజారాహిల్స్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడి వెనుక వ్యక్తిగత గొడవలే ప్రధాన కారణమని భావిస్తున్నారు. కానీ ఈ కేసు నిజానిజాలు తెలుసుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ త్వరితగతిన జరగబోతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదుఈ ఘటన సినీ పరిశ్రమలో కలకలం రేపింది. TV9 రిపోర్టర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. కేసు నమోదు తర్వాత మోహన్ బాబు సమర్థించుకోలేదని సమాచారం. మరోవైపు, ఘర్షణలో గాయపడ్డ మోహన్ బాబు ప్రస్తుతం బంజారాహిల్స్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడి వెనుక వ్యక్తిగత గొడవలే ప్రధాన కారణమని భావిస్తున్నారు. కానీ ఈ కేసు నిజానిజాలు తెలుసుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ త్వరితగతిన జరగబోతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
గత నాల్గు రోజులుగా మోహన్ బాబు ఇంట్లో నడుస్తున్న గొడవలు మీడియా లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు – మనోజ్ ల మధ్య తలెత్తిన ఆస్థి గొడవలు చివరికి పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళింది. ఇరువురు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం..ఆ తర్వాత ఇద్దరు గొడవ పడడం వంటివి జరిగింది. ప్రస్తుతం సీపీ మనోజ్ అండ్ విష్ణు లకు కౌన్సలింగ్ ఇచ్చి పంపించారు.