సినీ నటుడు వేణు తొట్టెంపూడిపై కేసు నమోదు

సినీ నటుడు వేణు పై కేసు నమోదు

ప్రముఖ సినీ నటుడు తొట్టెంపూడి వేణు సహా మరో నలుగురిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నిన్న కేసు నమోదు చేశారు. మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ‘ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్’ సంస్థలో వేణు ప్రతినిధిగా ఉన్నారు. ఈ సంస్థ గతంలో ఉత్తరాఖండ్‌లో జల విద్యుత్తు ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్ట్‌ను తెహ్రీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీహెచ్‌డీసీ) ద్వారా దక్కించుకుంది. ఈ కాంట్రాక్ట్‌ను హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రిత్విక్ ప్రాజెక్ట్స్, స్వాతి కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలు సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నాయి. అయితే, స్వాతి కన్‌స్ట్రక్షన్స్ సంస్థ మధ్యలోనే తప్పుకోవడంతో 2002లో రిత్విక్ సంస్థ పనులు మొదలుపెట్టింది.

Advertisements
uRFg1TF8DpH1wGRSbFV9mNqVsHL

ఆ తర్వాత ప్రోగ్రెసివ్, టీహెచ్‌డీసీ మధ్య వివాదం తలెత్తి ఢిల్లీ హైకోర్టుకు చేరింది. ఈ క్రమంలో రిత్విక్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు, ప్రోగ్రెసివ్ సంస్థ నిర్వాహకులు రద్దు చేశారు. దీంతో ఆ సంస్థ ఎండీ రవికృష్ణ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంస్థ తమతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. తాజాగా నాంపల్లి రెండో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు వేణుతోపాటు ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్ నిర్వాహకులు భాస్కరరావు హేమలత, శ్రీవాణి, ఎండీ పాతూరి ప్రవీణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ‘స్వయంవరం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన వేణు ఆ తర్వాత కళ్యాణ రాముడు, పెళ్లాం ఊరెళితే వంటి హిట్ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత సినిమాలకు దూరమైన వేణు ఇటీవల ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.

Related Posts
ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్..భావోద్వేగానికి గుర‌యిన ఫ్యామిలీ
Allu arjun bail

సంధ్య థియేటర్ ఘటనలో అరెస్టై.. చంచల్‌గూడ జైలులో ఉన్న అల్లు అర్జున్ఈరోజు ఉదయం విడుదల అయ్యారు. జైలు నుండి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అటు Read more

బాలీవుడ్‌ న‌టుడు గోవిందాకు బుల్లెట్ గాయాలు
actor govind

బాలీవుడ్‌ నటుడు, శివసేన లీడర్‌ గోవిందా ఇంట్లో గన్‌ మిస్‌ఫైర్‌ అయ్యింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో గోవిందాకు తీవ్ర గాయాలయ్యాయి. ఇవాళ తెల్ల‌వారుజామున 4.45 గంట‌ల Read more

మంత్రి పై ప‌రువు న‌ష్టం దావా.. రేపు కోర్టుకు హాజరుకానున్న నాగార్జున
Defamation suit against Konda Surekha. Nagarjuna to appear in court tomorrow

హైదరాబాద్‌: త‌న కుటంబం వ్య‌వ‌హారంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై హీరో అక్కినేని నాగార్జున దాఖలు చేసిన ప‌రువున‌ష్టం పిటిష‌న్‌ను నాంప‌ల్లి కోర్టు ఇవాళ విచారించింది. Read more

16 ఏళ్ల తర్వాత కలవబోతున్న మమ్ముట్టి, మోహన్ లాల్
Mohanlal Mammootty

మలయాళ స్టార్ నటులు ముమ్ముట్టి, మోహన్ లాల్ లు 16 ఏళ్ల తర్వాత కలిసి సినిమా చేయబోతున్నారు. ఇద్దరు తమ కెరీర్ బిగినింగ్ నుంచే కలిసి నటించడం Read more

×