Milk Price:దసరా గిఫ్ట్ – మదర్ డెయిరీ భారీగా తగ్గించిన ధరలు!
Milk : దసరా పండుగ కానుకగా మదర్ డెయిరీ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. పాలతో పాటు పెరుగు, నెయ్యి, పనీర్, ఐస్ క్రీం ధరలను గణనీయంగా తగ్గిస్తూ కొత్త ధరల జాబితాను విడుదల చేసింది. ఒక్కో ఉత్పత్తిపై రూ.2 నుంచి రూ.30 వరకు ధరలను తగ్గించారు. దీంతో వినియోగదారులకు కొంత ఉపశమనం లభించనుంది.
కొత్త ధరలు ఇలా ఉన్నాయి
- UHT టోన్డ్ మిల్క్ (1 లీటర్): పాత ధర రూ.77, కొత్త ధర రూ.75
- మిల్క్ షేక్ (180ml): రూ.30 నుండి రూ.28
- మలై పనీర్ (200g): రూ.100 నుండి రూ.95
- ప్లెయిన్ పనీర్ (200g): రూ.95 నుండి రూ.92
- నెయ్యి (1 లీటర్): రూ.675 నుండి రూ.645
- చీజ్ (200g): రూ.170 నుండి రూ.160
- చీజ్ క్యూబ్స్ (180g): రూ.145 నుండి రూ.135
- వెన్న (500g): రూ.305 నుండి రూ.285
ఐస్ క్రీమ్స్ పై కొత్త ధరలు
- ఐస్ క్యాండీ (45g): రూ.10 నుండి రూ.9
- వెనిల్లా కప్ (50ml): రూ.10 నుండి రూ.9
- చాకోబార్ (30ml): రూ.10 నుండి రూ.9
- వెనిల్లా కోన్ (100ml): రూ.30 నుండి రూ.25
- బటర్‌స్కాచ్ కోన్ (100ml): రూ.35 నుండి రూ.30
- హనీ చాకో స్టిక్స్, చాక్లెట్ కుకీలు, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ (50g): రూ.50 నుండి రూ.45
వినియోగదారులకు ఉపశమనం
ఢిల్లీ NCR సహా అన్ని నగరాల్లో ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తున్నాయి. పాల నుంచి ఐస్ క్రీం వరకు మదర్ డెయిరీ ధరలు తగ్గడం వల్ల వినియోగదారులకు గణనీయమైన పొదుపు లభించనుంది.
Read also :