శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వ రాలయంలో నిర్వహించే మహిమాన్విత రాహుకేతుదోష నివారణ పూజలను సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ (Prem Singh Tamang) కుటుంబ సభ్యులతో జరిపించుకున్నారు. వారికి ఆలయ మర్యాదలతో ఇఓ డి.బాపిరెడ్డి స్వాగతం చెప్పారు. ఏర్పాట్లును ఎఇఓ మోహన్, టెంపుల్ ఇన్సె పెక్టర్ వెంకటస్వామిలు పర్యవేక్షించారు. శ్రీకాళ హస్తీశ్వ రాలయంలో నిర్వహించే మహి మాన్విత రాహుకేతుదోష నివారణ పూజలకు దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ కుటుంబసభ్యులతో రాగావారికి దక్షిణ గోపురం వద్ద ఇఓ టి. బాపి రెడ్డి వేదపండితుల వేదమంత్రాలతో మేళ తాళాలతో స్వాగతం పలికారు. సిఎం ఆలయానికి రాగా ఇక్కడ నిర్వహించే రాహుకేతు దోష నివారణ పూజలు జరిపించుకోవాలని కోరారు. ఇట బాప్ రెడ్డి వెంటనే ఆలయంలోని సహస్రలింగేశ్వ రాలయం వద్ద ప్రత్యేక పూజా టిక్కెట్లు (Pooja tickets) కొనుగోలు చేసి ఏర్పాటు చేసారు. వేద పండితులు వేద మంత్రాలతో పూజలు జరిపించారు. తరువాత స్వామి అమ్మవార్ల అంతరాలయ దర్శనం ఏర్పాటు చేసారు. స్వామి అమ్మవార్ల దర్శనానంతరం వారికి గురుదక్షిణా మూర్తి ఆలయం వద్ద వేదపండితులతో ప్రత్యేకాశీర్వచనాలు అందించారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :