టాలీవుడ్ చరిత్రలో బాహుబలి Part-1, Part-2 (Bahubali Part-1, Part-2) సినిమాలు ఒక తిరుగులేని మైలురాయిగా నిలిచిపోయాయి. దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఈ చిత్రాల్లో ప్రతి పాత్రకు స్పెషల్ ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా, రానా దగ్గుబాటి పోషించిన భల్లాలదేవుడి పాత్ర అభిమానుల మదిలో గాఢంగా నిలిచిపోయింది.ఇటీవల నటి జయసుధ తనయుడు నిహార్ కపూర్ (Nihar Kapoor) బాహుబలి చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. మొదట భల్లాలదేవుడి పాత్రకు రానానే ఎంపిక చేసినప్పటికీ, ఆయన డేట్స్ అందుబాటులో లేకపోవడంతో బాహుబలి టీం తనను సంప్రదించిందని నిహార్ చెప్పారు.

పాత్ర కోసం శిక్షణ, కానీ చివరికి మార్పు
ఆ పాత్ర కోసం నిహార్ నాలుగు వారాల పాటు శిక్షణ కూడా తీసుకున్నట్టు తెలిపారు. అయితే, కొంతకాలానికే రానా తిరిగి వచ్చి ఆ పాత్రను తానే చేస్తానని చెప్పడంతో రాజమౌళి టీం తిరిగి రానానే ఫైనల్ చేసిందట.ఆ తర్వాత, దర్శకుడు రాజమౌళి నిహార్కు కాలకేయుడి పాత్రను ఆఫర్ చేశారట. ఆ పాత్రకు సంబంధించిన డిజైన్లు కూడా చూపించారట. కానీ ఆ పాత్రకు అధికంగా మేకప్ ఉండటంతో, నిహార్ తల్లి జయసుధ ఆలోచించారట.
తొలి సినిమాలో ముఖం కనిపించకపోతే ఎలా?
తొలి సినిమానే ముఖం కనిపించకపోతే ప్రేక్షకుల నుంచి స్పందన రాదేమోనన్న ఆందోళనతో, ఆ పాత్రను చేయొద్దని అమ్మ చెప్పారు అని నిహార్ తెలిపారు. అంతటి భారీ సినిమా కావడం, అవకాశం వచ్చి మిస్ కావడం బాధగా ఉన్నా… తాను మాత్రం ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పారు.”బాహుబలి” వంటి గొప్ప సినిమాలో భాగమవ్వలేకపోయిన బాధ కన్నా, రానా చేసిన పాత్ర ఎంతో గొప్పగా ఉన్నందుకు సంతోషమేనని నిహార్ తెలిపారు. తనకు వచ్చిన అవకాశం ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు.
Read Also : Anirudh Ravichander : అనిరుధ్ సంగీత కచేరీ వాయిదా