తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కృష్ణా నదీ జలాల వివాదంపై మాజీ సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని సూచించినట్టు ఆయన స్పష్టం చేశారు. “సవాల్ చేసినట్లు చూపిస్తున్నారు కానీ నేను కేవలం చర్చకు రావాలని మాత్రమే చెప్పాను” అని రేవంత్ స్పష్టం చేశారు. దీనిపై అసెంబ్లీలో ప్రతిపక్షం భాగస్వామ్యం కావాలని కోరుతూ, ప్రభుత్వ వైఖరిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ పాలన వల్లే నీటి విషయంలో తీవ్ర నష్టం
రెవంత్ రెడ్డి తేల్చి చెప్పారు – రాష్ట్రానికి నీటి విషయంలో నష్టాలు జరిగినది తమ ప్రభుత్వంలో కాదు, గతంలో కేసీఆర్ పాలనలోనే అని. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదుల వాటాల్లో తెలంగాణకు గల హక్కులను సమర్థవంతంగా రక్షించకపోవడం వల్లే రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. ఈ విషయాన్ని మరిచిపోయి, ఇప్పుడు నీటి సెంటిమెంట్‌ను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సరికాదని విమర్శించారు.
ప్రజలను మోసం చేసిన కేసీఆర్‌కు తగిన శిక్ష అవసరం
కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ చేసిన తప్పులు చాలా తీవ్రమైయ్యాయని రేవంత్ పేర్కొన్నారు. “ఈ ద్రోహానికి 100 కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే” అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేవలం మళ్లీ రాజకీయ ప్రాభవం పొందాలని చనిపోయిన పార్టీకి జలాల సెంటిమెంటుతో ఊపిరి పోస్తే ప్రజలు తేలికగా మోసపోరని హెచ్చరించారు. ఈ తరహా దుష్ప్రచారాలను ఎదుర్కొని, జలాల హక్కులను పూర్తిగా పొందేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.
Read Also : Congress Govt : నన్ను అలాంటి చోట్లకు పిలవొద్దు – సీఎం రేవంత్