हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

YCP : వైసీపీ నేతలకు పవన్, లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్

Sudheer
YCP : వైసీపీ నేతలకు పవన్, లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్

వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీవ్రంగా స్పందించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నేత చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళలపై అసభ్యంగా మాట్లాడటం వైసీపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఈ తరహా వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నాయని పేర్కొన్నారు. మహిళల గౌరవాన్ని భంగం పరచినవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పవన్ హెచ్చరించారు.

జగన్ నాయకత్వంపై లోకేష్ విమర్శలు

ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా ఈ వివాదంపై స్పందిస్తూ వైసీపీకి మహిళల పట్ల కనీస గౌరవం లేదని విమర్శించారు. “పెద్ద చదువులు చదివినా, ఇంగిత జ్ఞానం లేకపోతే అర్థం లేదు. మహిళలపై ఎవరైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే” అని పేర్కొన్నారు. మహిళా ఎమ్మెల్యే వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ప్రసన్న రెడ్డి (Nallapureddy Prasanna Kumar Reddy) చేసిన వ్యాఖ్యలు అమర్యాదకరమైనవని, ఈ వ్యవహారంపై ప్రభుత్వంగా తమ వైఖరి స్పష్టమని లోకేష్ హెచ్చరించారు.

ప్రజా ప్రభుత్వంగా తాము మహిళలకు అండ

పవన్ కల్యాణ్, లోకేష్ ఇద్దరూ సమన్వయంతో స్పందిస్తూ, “ఇది జగన్ జంగిల్ రాజ్ కాదని, మహిళల జోలికి వస్తే ఊరుకోమని” స్పష్టం చేశారు. ప్రజాస్వామిక వ్యవస్థలో మహిళల గౌరవాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. వైసీపీ నేతల మాటలు మహిళల స్వాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని, ఇదే తీరుతో కొనసాగితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వారిద్దరూ హెచ్చరించారు.

Read Also : Addanki Dayakar: కేటీఆర్‌‌పై అద్దంకి దయాకర్ సెటైర్లు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870