हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Rajendra Prasad: ఇకపై హుందాగా మాట్లాడతానన్న రాజేంద్రప్రసాద్

Anusha
Rajendra Prasad: ఇకపై హుందాగా మాట్లాడతానన్న రాజేంద్రప్రసాద్

ఇటీవలి కాలంలో ప్రముఖ హాస్యనటుడు, రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఒక సినిమా ఈవెంట్‌లో ఆయన మాట్లాడిన తీరు సినీ వర్గాల్లోనే కాక, సామాజిక మాధ్యమాల్లోనూ తీవ్రంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. రోజా, మురళీ మోహన్, అలీ లాంటి ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.ఒకటి రెండు రోజులుగా అటు ఇండస్ట్రీలోను ఇటు బయట కూడా రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) గురించిన చర్చ నడుస్తోంది.ఈ విషయంపై అలీ(Ali) సున్నితంగానే స్పందించినా, చాలామంది రాజేంద్రప్రసాద్ తీరును తప్పుబట్టారు. ఇటీవల కాలంలో రాజేంద్ర ప్రసాద్ ఇలా నోరు పారేసుకోవడం ఎక్కువైపోయిందంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సుమన్ టీవీతో మాట్లాడారు.

మేమంతా ఒకరికొకరం

అలీ నా మాట తీరును సీరియస్ గా తీసుకోలేదు,ఈ విషయాన్ని పెద్దది చేయవద్దని అతను చెప్పాడు కూడా. కానీ ఎవరో ఏదో ఉద్దేశంతో ఈ విషయాన్ని పెద్దది చేయాలనుకుంటే దానికి మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఇక్కడ మేమంతా ఒకరికొకరం ఎంతో ప్రేమతో ఉంటాము. ఆ మాత్రం సెంటిమెంట్స్(Sentiments) లేకపోతే మేము కలిసి ఇంతదూరం ప్రయాణం చేసే వాళ్లం కాదు గదా. అలీ మళ్లీ నాకు కాల్ చేసి జరిగింది మరిచిపొమ్మని చెప్పాడు. ఏదేమైనా జరిగినదానికి నేను చాలా హర్ట్ అయ్యాను” అని అన్నారు. 

Rajendra Prasad: ఇకపై  హుందాగా మాట్లాడతానన్న రాజేంద్రప్రసాద్
Rajendra Prasad

నేను ఎన్టీఆర్ గారి దగ్గరే

జీవితంలో ఇంకెప్పుడూ కూడా ఎవరినీ ‘నువ్వు’ అని సంభోదించను. ఇకపై ఎవరినైనా ‘మీరు’ అనే పిలుస్తాను. అలా పిలవడం నేను ఎన్టీఆర్ గారి దగ్గరే నేర్చుకున్నాను. నేను మాట ఇస్తున్నాను ఈ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకూ అందరినీ ‘మీరు’ అనే పిలుస్తాను. అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడతాను అని అన్నారు.అయితే, సోషల్ మీడియా(Social media)లో మాత్రం రాజేంద్రప్రసాద్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.వయస్సుతోపాటు ఆయనలో ఆత్మ నియంత్రణ తగ్గిపోతోందా?” అని ప్రశ్నిస్తున్నారు.ఇకపోతే, ఈ వివాదం త్వరలోనే తగ్గిపోతుందని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ వివాదం మరోసారి ఒక్క మాట ఎంత పరిణామాలకూ కారణమవుతుందో స్పష్టం చేసింది.

Read Also: Oka Yamudi Premakatha Movie: ఓటీటీలోకి ‘ఒక యముడి ప్రేమకథ’

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870