తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద వినాయక విగ్రహాలు

దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరగ్గా.. వివిధ రూపాల్లో లంబోదరుడు దర్శనమిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల అతిపెద్ద గణపతులను ప్రతిష్ఠించారు.

రెండేళ్ల క్రితం వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద విగ్రహం అంటే ఖైరతాబాద్ విగ్రహమే అని చెప్పేవారు కానీ..ఇప్పుడు ఖైరతాబాద్ విగ్రహం కంటే ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఏడాది విశాఖ(D) గాజువాక శ్రీనగర్లో 89 అడుగుల విగ్రహాం ఏర్పాటై.. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద విగ్రహంగా నిలిచింది. ఆ తర్వాత విజయవాడ సితార సెంటర్లో 72 అడుగుల దూండి గణపతి, 70 అడుగులతో ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహాలు అతి పెద్దవిగా ఉన్నాయి.