70వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

70th National Film Awards announced by Central Govt

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నేడు 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. కన్నడ సూపర్ డూపర్ హిట్ మూవీ “కాంతార”కు అవార్డుల పంట పండింది. ఉత్తమ ప్రేక్షకాదరణ పొందిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది. ఈ సినిమాలో నటనకు గాను రిషబ్ శెట్టి ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. మలయాళ చిత్రం “అట్టం” జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది.

70వ జాతీయ చలన చిత్ర అవార్డులు…

ఉత్తమ చిత్రం: ఆట్టమ్ (మలయాళం)
ఉత్తమ నటుడు: రిషప్ శెట్టి (కాంతార, కన్నడ సినిమా)
ఉత్తమ నటి – నిత్యామీనన్, మానసి పరేఖ్
ఉత్తమ ప్రాంతీయ చిత్రం – కార్తికేయ-2 (తెలుగు)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం – కేజీయఫ్-2 (కన్నడ)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం – పొన్నియన్ సెల్వన్-1 (తమిళం)
ఉత్తమ దర్శకుడు – సూరజ్ బర్జాత్యా
బెస్ట్ ఫిల్మ్ ప్రమోటింగ్ నేషన్, ఎన్విరాన్‌మెంటల్ వ్యాల్యూస్ – కచ్ ఎక్స్‌ప్రెస్ (గుజరాతీ)
ప్రేక్షకాదరణ పరంగా ఉత్తమ వినోద్మాక చిత్రం- కాంతార (కన్నడ)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ – బ్రహ్మాస్త్ర-1:శివ (హిందీ)
ఉత్తమ డెబ్యూ దర్శకుడు – ప్రమోద్ కుమార్, ఫౌజా (హరియాన్వీ)
ఉత్తమ సహాయ నటి – నీనా గుప్తా
ఉత్తమ సహాయ నటుడు – పవన్ రాజా మల్హొత్రా
ఉత్తమ సినిమాటోగ్రఫీ – పొన్నియన్ సెల్వన్ పార్ట్-1 (తమిళం), సినిమాటోగ్రాఫర్: రవి వర్మన్
ఉత్తమ ఫిమేల్ బ్లే బ్యాక్ సింగర్ – బాంబే జయశ్రీ,
ఉత్తమ మేల్ ప్లే బ్యాక్ సింగర్ – శ్రీపాథ్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ – నిక్కి జోషి
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – ఆనంద్ ఆద్య
ఉత్తమ ఎడిటింగ్ – ఆట్టమ్ (ఎడిటర్ మహేశ్ భువనేండ్)
ఉత్తమ సౌండ్ డిజైన్ – పొన్నియన్ సెల్వన్-1 (డిజైనర్ ఆనంద్ కృష్ణమూర్తి)
ఉత్తమ స్క్రీన్ ప్లే – ఆట్టం (ఆనంద్ ఏకర్షి)
ఉత్తమ మాటల రచయిత – అర్పితా ముఖర్జీ, రాహుల్ వి చిట్టెల
ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ – అన్బరివు (కేజీఎఫ్2)
ఉత్తమ కొరియోగ్రఫీ – జానీ మాస్టర్, సతీశ్ కృష్ణన్ మాస్టర్
ఉత్తమ లిరిక్స్ – ఫౌజా (హరియాన్వీ),
ఉత్తమ సంగీతం – బ్రహ్మాస్త్ర పార్ట్ 1: శివ (ప్రీతమ్)
ఉత్తమ నేపథ్య సంగీతం – పొన్నియన్ సెల్వన్-1 (ఏఆర్ రెహ్మాన్)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం – ఒడియా – దమన్
ఉత్తమ ప్రాంతీయ చిత్రం – మలయాళం – సౌదీ వెళ్లక్క సీసీ 225/2009
ఉత్తమ ప్రాంతీయ చిత్రం – మరాఠీ – వాల్వీ (ది టైర్మైట్)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం – హిందీ – గుల్ మొహర్
ఉత్తమ ప్రాంతీయ చిత్రం – బెంగాళీ – కబేరీ అంతర్థాన్
ఉత్తమ ప్రాంతీయ చిత్రం – పంజాబీ – బాగీ డి దీ
బెస్ట్ టివా ఫిల్మ్ – సికాసిల్