7 more airports in addition to AP.. Rammohan Naidu

ఏపీకి అదనంగా మరో 7 ఎయిర్‌పోర్టులు : రామ్మోహన్ నాయుడు

న్యూఢిల్లీ: ఏపీలో అదనంగా మరో ఏడు విమానాశ్రయాలు రాబోతున్నాయని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖామంత్రి కె.రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. శనివారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై ఆయన స్పందించారు. ఏపీ ప్రజల తరపున నిర్మలమ్మకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. ప్రతి ఇంటికీ కుళాయి ఇవ్వాలనేది ప్రధాని ఆలోచనగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జల్ జీవన్ నిధులు దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. 2028 వరకు జల్ జీవన్ పొడిగింపుతో ఏపీకి మేలు జరుగుతుందన్నారు. ఏపీకి సముచిత న్యాయం చేసేలా టీమ్ వర్క్ చేస్తామన్నారు. ఎంత వీలైతే అంత మొత్తంలో ఏపీకి నిధులు తెస్తామని పేర్కొన్నారు. పౌరవిమానరంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, వుడాన్ స్కీమ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారని, ఏపీలో అదనంగా మరో 7 ఎయిర్‌పోర్టులు రాబోతున్నాయి కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు అభిప్రాయపడ్డారు.

Advertisements
image

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు శుభవార్త చెప్పారు. రూ.12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆదాయపన్ను విధానంలో సంస్కరణలు తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ మేరకు శనివారం కేంద్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. కొత్త పన్ను శ్లాబులను ప్రకటించారు. పన్ను చెల్లింపుల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్టు చెప్పారు. అలాగే, మధ్యతరగతి ప్రజలు రూ.12 లక్షలకు వరకు ఆదాయం ఉంటే ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదని తెలిపింది.

Related Posts
పార్లమెంట్‌లో అదానీ స్కామ్, మణిపూర్ సమస్యపై చర్చకు నిరాకరణ
mallikarjuna karge

పార్లమెంట్ లో ఈ రోజు స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన 267 రూల్ కింద 13 నోటీసులు అందుకున్నట్లు ప్రకటించారు. వీటిలో ఎక్కువ భాగం ఆదాని Read more

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా – బీఏసీ భేటీలో హాట్ టాపిక్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా – బీఏసీ భేటీలో హాట్ టాపిక్స్

ఏపీ బడ్జెట్ సమావేశాలు రేపటికి వాయిదా – గవర్నర్ ప్రసంగం, వైసీపీ వాకౌట్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. శాసనసభ మరియు శాసనమండలిని ఉద్దేశించి Read more

Bihar: బిహార్‌లో పిడుగుల బీభత్సం.. 13 మంది మృతి
Lightning strikes in Bihar, 13 people killed

Bihar: బిహార్ రాష్ట్రం మరోసారి ప్రకృతి ప్రకోపానికి గురైంది. బుధవారం తెల్లవారుజామున భీకరమైన ఈదురు గాలులు, వడగళ్ల వాన బీభత్సం సృష్టించాయి. ఈ విపత్తు కారణంగా రాష్ట్రంలోని Read more

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళా హోమ్ గార్డు అరెస్ట్
Female home guard arrested

వేములవాడ : సంపన్నులను టార్గెట్ చేసి వలపు వల విసిరి బ్లాక్ మెయిల్ చేస్తూ పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్న హోమ్ గార్డు వడ్ల అనూషను పోలీసులు అరెస్ట్ Read more

×