7.1 magnitude earthquake hits Nepal

నేపాల్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం

న్యూఢిల్లీ: నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. 7.1 తీవ్రతతో భూకంపం రాగా దాని ప్రభావం ఉత్తర భారతదేశంలో కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ తో పాటు పొరుగున ఉన్న బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనూ భూమి కంపించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం నేపాల్- టిబెట్ సరిహద్దు ప్రాంతం లోబుచేకి ఈశాన్యంగా 93 కిలోమీటర్ల దూరంలో మంగళవారం ఉదయం 6:35 గంటలకు భూమి కంపించింది.

image
image

టిబెట్‌లోని షిగాట్సే నగరంలో రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు చైనా అధికారులు తెలిపినట్లు రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. భూకంప తీవ్రత నేపాల్ లో అధికంగా ఉంది. గతంలో అక్కడ భారీ భూకంపాలు సంభవించాయని తెలిసిందే. 2015లో నేపాల్ రెండు భారీ భూకంపాలు సంభవించాయి. ఆ సమయంలో దాదాపు 9,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 22,309 మంది గాయపడ్డారు.

నేపాల్ రాజధాని ఖాట్మండుకు చెందిన ఓ వ్యక్తి భూంకంపై స్పందించారు. ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని తెలిపారుు. “భూకంపం వచ్చినప్పుడు మేం నిద్రపోతున్నాను, కానీ మేం నిద్రిస్తున్న మంచం కదులుతోంది. మా బాబు మంచం కదిలిస్తున్నాడని మొదట అనుకున్నాను. కానీ కిటీకీలు కూడా కదలడం చూసి భయం వేసింది. ఇది భూకంపం అని నిర్ధారించుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేశాం. మా అబ్బాయికి ఫోన్ చేయడంతో అతడు కూడా క్షణాల్లో బయటకు వచ్చాడని తెలిపారు.

Related Posts
అయన ఓ మున్సిపల్ కౌన్సిలర్ బుద్ధి మాత్రం దొంగ..ఇదిగో వీడియో
అయన ఓ మున్సిపల్ కౌన్సిలర్ బుద్ధి మాత్రం దొంగ..ఇదిగో వీడియో

కూనూరులో మున్సిపల్ చైర్‌పర్సన్ గాజులను దొంగిలించడానికి ప్రయత్నించిన డీఎంకే కౌన్సిలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను సోషల్ మీడియా X పేజీలో పోస్ట్ Read more

ఢిల్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో కీలక వాగ్దానాలు
ఢిల్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో కీలక వాగ్దానాలు

ఫిబ్రవరి 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ చివరి మేనిఫెస్టోని శనివారం జరిగిన బహిరంగ సభలో అమిత్ షా విడుదల చేసారు. బీజేపీ అధికారంలోకి Read more

ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న అండర్ వరల్డ్ డాన్
ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న అండర్ వరల్డ్ డాన్

ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం సన్నిహితుడిగా ఉన్న ఛోటా రాజన్, 2001లో హోటల్ యజమాని జయ శెట్టి హత్య కేసుకు సంబంధించి 2024లో జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే, Read more

బీజేపీ సభలో జేబుదొంగల బీబత్సం
midhun chakravarthi

ప్రముఖ సినీ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తికి ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలోచేదు అనుభవం ఎదురైంది. నిర్సా అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తరఫున మిథున్ చక్రవర్తి Read more