ప్రత్యేకమైన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌ను రూపొందించడానికి 5 చిట్కాలు

5 Tips to Create a Unique LinkedIn Profile

హైదరాబాద్‌: లింక్డ్ఇన్ యొక్క తాజా పరిశోధన భారతదేశంలోని నిపుణులు ఉద్యోగాల కోసం వెతుకుతున్న విధానంలో పెద్ద మార్పును చూపుతోంది, మారుతున్న పని వాతావరణానికి అనుగుణంగా 73% మంది తాము అనుసరించే విధానాన్ని మార్చుకుంటున్నారు. ఈ మార్పులో భాగంగా రెజ్యూమ్‌లను మెరుగుపరచడం, సివి లను సృజనాత్మకంగా ప్రదర్శించడం మరియు లింక్డ్‌ఇన్‌లో కంటెంట్‌ను పోస్ట్ చేయడం వంటి వాటికోసం ఎక్కువ సమయం వెచ్చించడం కనిపిస్తుంది. మీరు ప్రత్యేకంగా నిలబడాలని చూస్తున్నట్లయితే, మీ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌ను సూపర్‌ఛార్జ్ చేయడానికి ఇక్కడ 5 సాధారణ చిట్కాలు ఉన్నాయి, మీ ప్రొఫైల్‌ గుర్తించబడుతుందని మరియు మిమ్మల్ని నియమించుకోవడంలో హైరింగ్ మేనేజర్‌ల పై శాశ్వత ముద్రను వేస్తుందని నిర్ధారించుకోండి.

1. మీ ప్రొఫైల్ ఫోటోతో ఎదుటివారి దృష్టిని ఆకర్షించండి:

మీ ప్రొఫైల్ చిత్రం మీ వర్చువల్ హ్యాండ్‌షేక్ లాంటిది. ఇది ప్రత్యేకంగా మీదేనని నిర్ధారించుకోండి – గ్రూప్ షాట్‌లను నివారించండి. అప్రోచ్యబిలిటీ మరియు ప్రొఫెషనలిజానికి ప్రాధాన్యతనిస్తూ మీ ముఖాన్ని ప్రత్యేకంగా చూపించే అధిక-నాణ్యత చిత్రాన్ని ఎంచుకోండి. మీ ఫోటో మీ గురించి ఒక అభిప్రాయం తొలుత ఏర్పరుస్తుంది , కాబట్టి దానిని ప్రత్యేకంగా ఉంచండి !

2. ‘అబౌట్’ విభాగంలో మీ ఎలివేటర్ పిచ్‌ను ఎలివేట్ చేయండి:

‘అబౌట్’ ( పరిచయం) విభాగం మీ వ్యక్తిగత ఎలివేటర్ పిచ్. మీ గురించి అర్ధవంతమైన సందర్భాన్ని అందించడానికి మీ వృత్తిపరమైన కథ, విద్యా ప్రయాణం లేదా జీవిత అనుభవాలను ఒడిసిపట్టండి. ఆ తరువాత , మీ అత్యుత్తమ నైపుణ్యాలను ప్రదర్శించండి మరియు మీ కెరీర్ లక్ష్యాలను వ్యక్తపరచండి. శాశ్వతమైన ముద్ర వేయడానికి ఇది మీకు ఓ చక్కటి అవకాశం.

3. మీ నైపుణ్యాలను గుర్తించండి:

నేటి జాబ్ మార్కెట్‌లో, 50% లింక్డ్‌ఇన్ రిక్రూటర్‌లు ఉద్యోగ శీర్షికల కంటే నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అనేక సాంకేతిక మరియు మానవ నైపుణ్యాలు బదిలీ చేయబడతాయి, పరిశ్రమలలో అవకాశాలను అందిస్తాయి. ఉదాహరణకు, సిఆర్ఎం నైపుణ్యాలు రియల్ ఎస్టేట్, రిటైల్ మరియు బిజినెస్ కన్సల్టింగ్‌లో తలుపులు తెరవగలవు; మరియు ప్రోగ్రాం మేనేజ్‌మెంట్ , కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలకు సమస్య పరిష్కారం మరియు విమర్శనాత్మక ఆలోచన వంటి సాఫ్ట్ స్కిల్స్ అమూల్యమైనవి. ప్రభావాన్ని పెంచడానికి, మీ పరిచయం విభాగంలోని 5 అత్యంత సంబంధిత నైపుణ్యాలను హైలైట్ చేయండి మరియు సంభావ్య యజమానులకు మీ విలువను ప్రదర్శించడానికి వాస్తవ ప్రపంచ ఉదాహరణలను చెప్పే ప్రయత్నం చేయండి.

4. డైనమిక్ ‘అనుభవం’ విభాగాన్ని రూపొందించండి:

మీ ప్రయాణం, నైపుణ్యాలు మరియు విజయాలు ఎక్స్‌పీరియన్స్ విభాగంలో ప్రధాన స్థానాన్ని ఆక్రమిస్తాయి. మీ కీలక అనుభవాలు, విద్య, సైడ్ ప్రాజెక్ట్‌లు మరియు వాలంటీర్ వర్క్ రిక్రూటర్‌లను ఆకర్షించడానికి మీ సామర్థ్యాలను పూర్తి చేయడంలో సహాయపడతాయి. అనుభవ విభాగంలో జాబితా చేయబడిన గత పాత్రలలో మీ కీలక బాధ్యతలు మరియు విజయాలను గుర్తించడం ద్వారా, మీరు వివిధ స్థానాల్లో మీ నైపుణ్యాలను ఎలా ఉపయోగించారో చూపుతారు, సంభావ్య యజమానులకు మీ బహుముఖ ప్రజ్ఞ మరియు విలువను ప్రదర్శిస్తారు.

5. మీ ఉత్తమ పనిని ప్రదర్శించండి:

మీ అత్యుత్తమ పనిని క్యూరేట్ చేయడానికి మరియు ప్రదర్శించడానికి ఫీచర్డ్ విభాగాన్ని ఉపయోగించండి. మీ నైపుణ్యం మరియు అనుభవం యొక్క స్పష్టమైన ప్రదర్శనను అందిస్తూ, మీ విజయాలు వెల్లడించండి .