Headlines
తమన్ మ్యూజిక్ అంటే.. దెబ్బకు కిందపడిన స్పికర్స్

తమన్ మ్యూజిక్ అంటే.. దెబ్బకు కిందపడిన స్పికర్స్..

ఈ సంక్రాంతి పండుగకు నందమూరి బాలకృష్ణ “డాకు మహారాజ్“సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు.ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ప్రమోషన్స్ కూడా ఊహించని స్థాయిలో జరుగుతున్నాయి.తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించి ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది చిత్రబృందం.డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న డాకు మహారాజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా భారీ అంచనాలను నెలకొల్పింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 12న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల హైదరాబాదులోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

thaman
thaman

అయితే ఈ వేడుకలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో “డాకు” పాటను ప్లే చేయగా, థమన్ కంపోజ్ చేసిన మ్యూజిక్ బేస్ దెబ్బకి స్పీకర్లు కిందపడిపోయాయి. వెంటనే టీమ్ అప్రమత్తమై అవి మళ్లీ సెట్ చేయాల్సి వచ్చింది. స్పీకర్లు కిందపడడం చూసి థమన్‌తో పాటు డాకు మహారాజ్ టీం ఒక్కసారిగా పడి పడి నవ్వుకుంది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్స్ “బాలయ్య-థమన్ కాంబో అంటే థియేటర్లు దద్దరిల్లాల్సిందే” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సరదాగా మాట్లాడుతూ, “బాలయ్యగారితో సినిమా అంటే స్పీకర్లు తట్టుకోలేవు! బాలకృష్ణ, నాది సినిమా వస్తుందంటే కొత్త స్పీకర్లు రెడీగా పెట్టుకోండి. నేనెమీ చేయలేను. ఇది వార్నింగ్ కాదు… సినిమాకు హై ఎనర్జీ ఉండటంతో అలాంటి మ్యూజిక్ ఇస్తాను” అని నవ్వుతూ చెప్పారు.ఈ సంఘటనతో డాకు మహారాజ్ పై క్రేజ్ మరింత పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

A cartoon depiction of an ancient man meeting a brutal death. Choosing food by domestic helper | 健樂護理有限公司 kl home care ltd. Peringati hari kartini, bp batam gelar senam pound fit di taman kolam sekupang.