హరీష్ శంకర్ కెరీర్‌లో ఇప్పుడు ఆసక్తికరమైన మలుపు తిరిగింది.గద్దలకొండ గణేష్’ తరువాత ఆయన దర్శకత్వం వహించిన ప్రాజెక్టులు అనుకున్నంత సజావుగా సాగలేదు.పవన్ కళ్యాణ్‌తో చేయాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా రాజకీయాల కారణంగా ఆలస్యం అవుతోంది.పవన్ పూర్తిగా రాజకీయాల్లో బిజీగా ఉండటంతో హరీష్ శంకర్ ఎదురుచూడడం తప్ప మరో దారి లేకుండా పోయింది.ఇక మిస్టర్ బచ్చన్ సినిమాతో రవితేజను తెరపైకి తీసుకొచ్చిన హరీష్, ఆ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది.’రైడ్’ సినిమాకు రీమేక్‌గా వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్‌గా నిలిచింది. ఇది హరీష్ శంకర్ కెరీర్‌లో ‘రామయ్యా వస్తావయ్యా’తర్వాత మరో భారీ అపజయం.ఈ సినిమా తీరును చూసి ఆయనపై తీవ్ర ట్రోలింగ్ కూడా ఎదురైంది.ఈ పరిస్థితుల్లో హరీష్ శంకర్ దృష్టిని మరో స్టార్ హీరోపై పెట్టారు.ఆయన ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నారు.ఇప్పటికే మిస్టర్ బచ్చన్ టైమ్‌లోనే ఈ ప్రాజెక్ట్ పై చర్చలు జరిగాయని సమాచారం.
బాలయ్యకు కథ నచ్చితే హరీష్ శంకర్‌కు అవకాశం ఇవ్వడం ఖాయం. బాలయ్య గతంలో ‘అఖండ’ వంటి సినిమాలతో మాస్ ఆడియెన్స్‌కి దగ్గరయ్యారు.ఇప్పుడు ‘అఖండ 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయనకు కొత్త కథలు వినడం పెద్ద విషయం కాదు. బాలయ్యతో సినిమా చేయాలంటే మాస్ అనుభూతిని పక్కాగా అందించాలి. హరీష్ శంకర్‌కు అలాంటి కథలు చెప్పడంలో అనుభవం ఉంది. ఆయన గత హిట్స్ అన్నీ మాస్, కమర్షియల్ సినిమా జానర్‌కి చెందినవే. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్, ఇప్పుడు బాలయ్యతో కలిసి మరో పవర్‌ఫుల్ సినిమాను తెరపైకి తీసుకురావాలనుకుంటున్నారు.ఇక పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆలస్యం కావడం వల్ల, హరీష్ శంకర్ కొత్త దారి వెతకడం తప్పనిసరి అయింది. బాలయ్యతో ప్రాజెక్ట్ ఉంటే హరీష్‌కు మళ్లీ విజయబాట పట్టే అవకాశముంది. కథ నచ్చితే బాలయ్య వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.