Headlines
ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరో

ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరో

హృతిక్ రోషన్, బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి,’కహో నా ప్యార్ హై’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ నటుడు, తరువాత ఎన్నో హిట్ సినిమాలతో దేశంలో అత్యధిక పారితోషకాలు పొందే హీరోలలో ఒకడు. ఈ క్రేజీ స్టార్ శుక్రవారం (జనవరి 10) 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.ఈ వయసులో కూడా ఫిట్ అండ్ ఫైన్‌గా కనిపిస్తున్న హృతిక్, తన అభిమానుల నుంచి అనేక బర్త్‌డే విషెస్ అందుకుంటున్నారు.హృతిక్ రోషన్ 12 సంవత్సరాల వయసులో బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.

రజనీకాంత్ నటించిన ‘భగవాన్ దాదా’ చిత్రంలో హృతిక్ బాలనటుడిగా నటించి, ఎంతో మంది ప్రేక్షకులను ఆకర్షించాడు. ఈ చిత్రంలో అతని తండ్రి రాకేష్ రోషన్ కీలక పాత్ర పోషించారు.ఈ సినిమా హృతిక్ కెరీర్‌కు మైలురాయిగా మారింది. హృతిక్ రోషన్ ‘కహో నా ప్యార్ హై’ సినిమా ద్వారా హీరోగా మారి,ఆ తర్వాత వరుస విజయాలతో టాప్ హీరోగా ఎదిగాడు. ఇప్పుడు, ఒక సినిమాకు 75-100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న హృతిక్, ప్రముఖ బ్రాండ్లను కూడా ప్రమోట్ చేస్తున్నాడు.

ఆయన సొంత HRX బ్రాండ్‌ను కలిగి ఉన్నాడు, ఇది 200 కోట్ల రూపాయల విలువ కలిగిన వ్యాపారం.తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ షేర్ చేయడానికి హృతిక్‌కు 4 కోట్ల రూపాయలు వస్తాయి.ఆయన ఫిట్‌నెస్ మరియు క్రీడా వస్తువుల మార్కెట్‌ను ప్రభావితం చేస్తూ, HRX బ్రాండ్ ద్వారా బూట్లు, షర్టులు తదితర వస్తువులు అందుబాటులో ఉన్నాయి. హృతిక్ రోషన్ రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడులు పెట్టాడు. ముంబై జుహులో అతనికి విలువైన డూప్లెక్స్ హౌస్ ఉంది. 70 కోట్ల రూపాయలతో కూడిన పెంట్‌హౌస్ కూడా ఇందులో భాగం. అతనికి జుహులో మరిన్ని స్థలాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, లోనోవాలా సమీపంలో 7 ఎకరాల్లో ఉన్న ఫామ్‌హౌస్, వందల కోట్ల విలువ కలిగిన ఆస్తి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

House to vote on $460 billion government funding package ahead of friday shutdown deadline – mjm news. Advantages of overseas domestic helper. Diskusi ringan, pemuda katolik komda kepri bahas pengembangan unit usaha.