ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ ఇప్పుడు ఓటీటీలో

ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ ఇప్పుడు ఓటీటీలో

సిద్ధార్థ్, ఆషికా రంగనాథ్ జంటగా నటించిన ‘మిస్ యూ’ ఓటీటీలో విడుదల మిస్ యూ సినిమా, సిద్ధార్థ్ మరియు ఆషికా రంగనాథ్ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్,పుష్ప 2 విడుదలైన సరిగ్గా వారం రోజుల తర్వాత థియేటర్లలోకి వచ్చింది. కానీ, పుష్ప 2 భారీ విజయం దృష్ట్యా ఈ సినిమా పెద్దగా నిలబడలేకపోయింది. అయితే,సిద్ధార్థ్ ప్రేమకథా చిత్రం మిస్ యూ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోంది.

అదీ, ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా.డిసెంబర్ 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, సినిమా థియేటర్లలో సరాసరి వసూళ్లతో విడుదలైంది. పుష్ప 2 ప్రభంజనంతో తడబడినా, మిస్ యూ ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది.జనవరి 10, శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.తెలుగు తో పాటు తమిళ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది.

Siddharth Miss You movie
Siddharth Miss You movie

7 మైల్ పర్ సెకండ్ బ్యానర్ పై సామ్యూల్ మాథ్యూ నిర్మించిన ఈ సినిమాను కరుణాకరన్, బాల శరవణన్, సభా మారన్, జయ ప్రకాశ్, పొన్నవన్, ఆడుకలం నరేన్, అనుపమా కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.సంగీతం అందించిన గిబ్రాన్ ఈ సినిమాలో అందించిన మెలోడి పాటలు మంచి స్పందనను రాబట్టాయి.

ఈ సినిమా కథలో,హీరో తన ప్రియురాలితో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు.తర్వాత, ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల అతను ఆమెతో విడిపోవాల్సి వస్తుంది. ఈ పాయింట్ ఆధారంగా ఈ సినిమా సాగుతుంది.మరి, మీరు మిస్ యూ సినిమాను థియేటర్లలో మిస్ చేసారా? ఇక కంగ్రాట్స్! ఇప్పుడు మీరు ఈ సినిమాను ఓటీటీలో చూడవచ్చు. రొమాంటిక్ సినిమాలు ఇష్టపడే వారికోసం ఇది మంచి ఎంటర్టైనర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Florida bundled golf | golf course communities in southwest florida. Icomaker. Advantages of overseas domestic helper.