Headlines
It is sad that devotees lost their lives.. Jagan

భక్తులు ప్రాణాలు కోల్పోవడం విచారకరం: జగన్‌

అమరావతి: తిరుమల వేంకటేశ్వరస్వామి వైకుంఠ దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీచేస్తున్న కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.

image
image

గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. వెంటనే అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

నిన్న తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీలో ఐదుగురు మహిళలుతో పాటు ఓ వ్యక్తి మృతి చెందారు. వారిలో విశాఖకు చెందిన జి. రజనీ (47) లావణ్య (40), శాంతి (34), తమిళనాడుకు చెందిన మెట్టు సేలం మల్లికా, కర్ణాటకకు చెందిన నిర్మల (50), నర్సీపట్నంకు చెందిన బొద్దేటి నాయుడుబాబు చనిపోయారు. మరికొందరు తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *