ప్రస్తుతం టాలీవుడ్‌లో మ్యూజిక్ అంటే ముందుగా వినిపించే పేర్లు తమన్, దేవీ శ్రీ ప్రసాద్. ఈ ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు మ్యూజిక్ లవర్స్‌ను ఎంటర్‌టైన్ చేయడంలో కొన్ని మార్పులు చేసినప్పటికీ, ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులపై భారీ ఆశలు పెట్టుకున్నారు. వీరి అప్‌కమింగ్ సినిమాలు ఇప్పటికే మ్యూజిక్ ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి.మునుపటి రోజుల్లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్న దేవీ శ్రీ ప్రసాద్ ఇటీవల కాస్త వెనుకబడ్డారు. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ రేసులో కొంత విరామం తీసుకున్నప్పటికీ, దేవీ మార్క్ బీట్స్ మాత్రం ప్రేక్షకులకు కచ్చితంగా కనెక్ట్ అవుతున్నాయి. పుష్ప 2 మ్యూజిక్‌తో ఆయన పేరు మళ్లీ ట్రెండ్‌లోకి వచ్చింది. “కంగువ” వంటి సినిమాలు కమర్షియల్‌గా ఫెయిల్ అయినా, దేవీ మ్యూజిక్ మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.తాజాగా తండేల్ చిత్రంతో ఆయన సూపర్ ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన “బుజ్జి తల్లి” సాంగ్ బ్లాక్‌బస్టర్ అయ్యింది.
అలాగే త్వరలోనే విడుదల కానున్న “నమో నమః శివాయ” సాంగ్ కూడా ట్రెండింగ్‌లోకి రావడం ఖాయం అని అనిపిస్తోంది.ఇక పరభాషా సంగీత దర్శకులు టాలీవుడ్‌లో జోరు పెంచటంతో తమన్ కూడా కొత్త విజయాల కోసం కష్టపడుతున్నారు. ప్రస్తుతం ఆయన కెరీర్‌లోని కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్‌తో సాలిడ్ కమ్‌బ్యాక్ కోసం ప్రయత్నిస్తున్నారు. గేమ్ చేంజర్, ది రాజాసాబ్, ఓజీ, అఖండ 2 వంటి భారీ సినిమాలు తమన్ లిస్టులో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్‌తో మరోసారి తన మార్క్ ప్రూవ్ చేసుకోవాలని తీవ్రంగా కృషి చేస్తున్నారు.ఈ ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు తమ-తమ బిగ్ ప్రాజెక్ట్స్‌తో సిద్ధమవుతుండటంతో టాలీవుడ్‌లో మ్యూజిక్ వార్ మీద హాట్ డిస్కషన్స్ మొదలయ్యాయి. ప్రేక్షకులను మెప్పించేందుకు ఈ ఇద్దరూ తమ బెస్ట్ డెలివర్ చేయడం ఖాయం. ఒకవైపు దేవీ తన మెలోడీ బీట్స్ తో ఆకట్టుకుంటుండగా, మరోవైపు తమన్ తన మాస్ ఎలిమెంట్స్ తో అందరినీ అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు.