పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని రేపింది.ఈ సంఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు,ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.సంధ్య థియేటర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనపై మెగా డాటర్ నిహారిక కొణిదెల మొదటిసారిగా స్పందించింది.
“ఇలా దురదృష్టకర సంఘటన జరగడం నాకు ఎంతో బాధగా అనిపించింది,” అని నిహారిక అన్నారు.”రేవతి మరణించడం నిజంగా మనసును తడిపించింది.ఎవరూ ఇలా జరగాలని కోరుకోరు. ఒకరి ప్రాణం పోవడం అనేది చాలా పెద్ద విషయం.మనం బతకడానికే ఈ పని చేస్తాం,” అని ఆమె చెప్పారు.
![సంధ్య థియేటర్ ఘటనపై తొలిసారి స్పందించిన నిహారిక.](https://vaartha.com/wp-content/uploads/2025/01/niharika-konidela-1024x576.webp)
ఈ ఘటన వల్ల అందరూ చాలా షాక్‌కి గురయ్యారని, అల్లు అర్జున్ కూడా ఎంతో బాధపడ్డారని ఆమె అన్నారు.”ఈ బాధ నుంచి బన్నీ త్వరలో కోలుకుంటారని ఆశిస్తున్నాం,” అని నిహారిక చెప్పుకొచ్చారు.సినిమాల పరంగా అల్లు అర్జున్ నుండి ఎంతో నేర్చుకున్నానని నిహారిక చెప్పారు.”బన్నీ లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు.ఆయన ప్రతి సినిమాలో తన స్టైల్ మార్చుకుంటాడు.ఈ విషయంలో ఆయనే నాకు స్ఫూర్తి,” అని నిహారిక వివరించారు.అంతేకాక, తన కుటుంబ హీరోలపై కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.”ఇంట్లో పర్సనల్ మరియు ప్రొఫెషనల్ విషయాల్లో వారి సూచనలను నేర్చుకుంటాను.
నేను ఎలాంటి సినిమా సైన్ చేసినా,ముందుగా అన్న వరుణ్ తేజ్‌తో డిస్కస్ చేస్తాను,”అని ఆమె అన్నారు.”రామ్ చరణ్ అన్నతో నేను చాలా జోవియల్‌గా ఉంటాను.ఆయనను చాలాసార్లు ఆట పట్టిస్తుంటాను.అలాగే,ఇంటర్వ్యూల్లో ఎలా మాట్లాడాలో, వ్యవహరించాలో రామ్ చరణ్ నుంచి నేర్చుకుంటాను,” అని నిహారిక చెప్పుకొచ్చారు.ఈ ఘటనపై ఆమె స్పందన, తాను నేర్చుకున్న విషయాలపై చేసిన వ్యాఖ్యలు, అభిమానుల్ని మరియు కుటుంబ సభ్యులను గౌరవిస్తూ చెప్పిన మాటలు ఆమె వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాయి.