యువతకు భవిష్యత్తులో ఉపాధి దొరికే విధంగా ఐటిఐలో కొత్తగా కోర్సును ప్రవేశపెట్టారు. టాటా కంపెనీ ఆధ్వర్యంలో యువతకు ఎలక్ట్రిక్ వాహనాలను రిపేరింగ్ చేసే మెకానిక్ కోర్సును ప్రవేశపెట్టి, యువతకు ఉచితంగా రెండు సంవత్సరాల పాటు శిక్షణను ప్రభుత్వ ఐటిఐ కళాశాలలు ఇవ్వనున్నాయి.సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో ప్రభుత్వ ఐటిఐలో ఈ సరికొత్త కోర్సును వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టనున్నారు.
నేటి యువతరంకు ఉపయోగపడే, ఉపాధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటున్న తరుణంలో ఎలక్ట్రికల్ వాహనాల రిపేరింగ్ చేసే ఈ కోర్సు ఎంతో ఉపయోగపడనుంది.
రెండు సంవత్సరాల పాటు ఈ ఎలక్ట్రికల్ కారు మెకానిక్ నందు శిక్షణ ఇస్తున్నట్లు లోకల్ 18తో మెకానిక్ లెక్చరర్ అరుణ్ తెలిపారు. గతంలో ఎక్కడా లేని విధంగా ఎలక్ట్రికల్ వాహనాల మెకానిక్ యువతరానికి నేర్పితే భవిష్యత్తులో ఇంకా వారు స్థిరపడే అవకాశాలు ఉంటాయన్నారు. ఎలక్ట్రికల్ వాహనాలు ఇంకా పెరిగే కొద్దీ వారికి సొంతంగా మెకానిజంలో రావడానికి ఈ కోర్సును తీసుకొచ్చామని శిక్షణ ఇస్తున్న అరుణ్ వివరించారు. 10వ తరగతి పాసైన యువతకు ఈ మెకానిక్ కోర్స్ నేర్చుకోవడం వలన వివిధ కంపెనీలతో పాటు వారు సొంత షాపు పెట్టుకుని ఉపాధి పొందే విధంగా ఉంటుందని సూచించారు.